
తన చివరి చిత్రం ‘నాయుడమ్మ’ . సరిగ్గా 13 ఏళ్ళ తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మేకప్ వేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
డబుల్ హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది.
ఈ చిత్రం కోసం విజయ శాంతి అత్యధిక పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు నుండి ఆమె షూటింగ్ లో పాల్గొన్నారు. ‘13 ఏళ్ల తర్వాత..
ఇది విజయశాంతి మేడమ్‌కు మేకప్ టైమ్.
ఈ 13 ఏళ్ల విరామంలో ఆమెలో ఎటువంటి మార్పులేదు. అదే క్రమశిక్షణ, ప్రవర్తన, ధీరత్వం. స్వాగతం మేడమ్’ అని పోస్ట్ చేశారు.. దర్శకుడు అనిల్ రావిపూడి.
అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా విజయశాంతికి స్వాగతం పలికారు.. చాలా కాలం గ్యాప్ తర్వాత విజయశాంతి షూటింగ్ లో పాల్గొనటం నటీనటులు అందరూ సంతోషంతో అబినందనలు, హర్షం వ్యక్తం చేస్తున్నారు.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
ప్రకాశ్‌రాజ్, నరేశ్, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, తదితరులు పలు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు.. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది..!