Homeగాసిప్స్బన్నీకు సరైన విలన్ దొరికేసాడుగా

బన్నీకు సరైన విలన్ దొరికేసాడుగా

బన్నీకు సరైన విలన్ దొరికేసాడుగా
బన్నీకు సరైన విలన్ దొరికేసాడుగా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే అల వైకుంఠపురములో టీమ్ ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్న విషయం తెల్సిందే. సినిమా విడుదలకు మూడు నెలల ముందే ఆల్బమ్ లోని రెండు పాటల్ని విడుదల చేయగా రెండు పాటలూ ఒకదాన్ని మించి మరొకటి యూట్యూబ్ లో వ్యూస్ సాధిస్తూ రికార్డులను తిరగరాస్తున్నాయి. సామజవరగమన సాంగ్ అయితే 60 మిలియన్ రేపో మాపో అందుకునేలా కనిపిస్తోంది. ఆల్రెడీ మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్ గా రికార్డు సృష్టించింది. దాని తర్వాత విడుదలైన రాములో రాముల సాంగ్ అయితే మొదటి రోజు ఎక్కువ వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ సాంగ్ గా రికార్డు సృష్టించింది. ఈ రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఎక్కడ చూసినా వీటి గురించే డిస్కషన్. అల వైకుంఠపురములో టీమ్ కోరుకున్న దానికన్నా ఎక్కువ మైలేజి ఈ రెండు పాటల ద్వారా లభించింది. ఇప్పటికే ప్రమోషన్స్ మంచి ఊపులో ఉండగా దాన్ని తగ్గించకూడదని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. అందుకే నవంబర్ 7న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా అల వైకుంఠపురములో టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఇది నిజమా కాదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.

ఇది పక్కన పెడితే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో పూర్తవ్వగానే సుకుమార్ సినిమా చేయాలని డిసైడ్ అయిన విషయం తెల్సిందే. స్క్రిప్ట్ అంతా విన్న తర్వాత సుకుమార్ కు కొన్ని మార్పులు సూచించిన అల్లు అర్జున్, మార్పులు జరిగిన తర్వాత ఫుల్లుగా సంతృప్తి చెందాడట. ఎర్ర చెందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ప్రాధమికంగా తెలుస్తోంది. స్క్రిప్ట్ లాక్ అయిపోవడంతో సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోయాడు. ఈ చిత్రంలో నటించాల్సిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో సుకుమార్ ఉన్నాడు. ఈ చిత్రంలో విలన్ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందిట. రంగస్థలంలో జగపతి బాబు మాదిరి పవర్ఫుల్ క్యారెక్టర్ ను రాసుకున్నాడట. అందుకే ఈ పాత్రలో నటించడానికి తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి అయితే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని సుకుమార్ భావిస్తున్నాడు. ఇంకా విజయ్ ను ఈ విషయమై కలవాల్సి ఉందిట. ఇటీవలే విజయ్ సేతుపతి సైరా నరసింహారెడ్డిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోగల విజయ్ ఉంటే సినిమా స్థాయి పెరుగుతుందని సుకుమార్ భావన. ఈ చిత్రంలో అల్లు అర్జున్ – విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయట. మరి విజయ్ ఇంత స్పెషల్ రోల్ ను చేయడానికి ఎస్ అంటాడా లేదా అన్నది చూడాలి. అల వైకుంఠపురములో సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో జనవరి ఆఖరు వారంలో సుకుమార్ సినిమా మొదలవుతుందని వినికిడి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All