Homeగాసిప్స్బన్నీ - సుకుమార్.. మళ్ళీ అదే కథ

బన్నీ – సుకుమార్.. మళ్ళీ అదే కథ

బన్నీ - సుకుమార్.. మళ్ళీ అదే కథ
బన్నీ – సుకుమార్.. మళ్ళీ అదే కథ

టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ సుకుమార్ – అల్లు అర్జున్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆర్య సిరీస్ లతో యూత్ కి బాగా దగ్గరైన ఈ కాంబినేషన్ లో మళ్ళీ కొత్త సినిమా ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ వీరిద్దరికి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కానీ సినిమా స్క్రిప్ట్ మాత్ర ఇంకా ఫైనల్ కావడం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి.

గతంలో ఎప్పుడు లేని విధంగా శేషాచలం అడవులలో కొనసాగే స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చింది. కానీ అల్లు అర్జున్ మనసు మార్చుకొని రొమాంటిక్ స్టైల్ లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ ట్రై చేద్దామని చెప్పాడట. సుక్కు కూడా ఏ మాత్రం నో చెప్పకుండా ఆర్య స్టైల్ లో మళ్ళీ తన పాత ఫార్ములాకు పదును పెట్టడానికి ట్రై చేశాడట. ఇక అవేమి సెట్టవ్వకపోవడంతో చిత్ర యూనిట్ డిస్కర్షన్స్ వల్ల కథ మొదటికి వచ్చింది.

- Advertisement -

స్క్రిప్ట్ విషయంలో కాస్త మార్పులు చేసి యాక్షన్ మోడ్ లో మొదటి కథను తెరకెక్కించాలని సుక్కు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒప్పుకొని బడ్జెట్ లిమిట్ లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రంగస్థలం సినిమాతో డబుల్ ప్రాఫిట్స్ దక్కడంతో నిర్మాతలు సుకుమార్ పై నమ్మకం పెంచుకుంటున్నారు. మరి సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All