
శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ `800`. ఈ చిత్రంలో మురళీధరన్‌గా తమిళ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న విజయం తెలిసిందే. ఎం.ఎస్. శ్రీపతి దర్శకత్వంలో ట్రైన్‌మోషన్ పిక్చర్స్, వివేక్ రంగాచారి ఈ చిత్రాన్ని అంత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనిపై తాజాగా వివాదం మొదలైన విషయం తెలిసిందే.
తమిళులని గత కొన్ని దశాబ్దాలుగా శ్రీలంక ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తూ అవమానిస్తోంది. సింహలీయులకు, తమిళులకు గత కొన్ని దశాబ్దాలుగా వైరం నడుస్తోంది. ఇప్పటికే చాలా మందిని లంక సైన్యం అత్యంత దారుణంగా హతమార్చింది కూడా.. అలాంటి శ్రీలంకకు చెందిన వ్యక్తి బయోపిక్‌లో ఓ తమిళుడు నటించడం ఏంటని నెటిజన్స్‌తో పాటు తమిళ వర్గాలు విజయ్ సేతుపతిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ స్పందించారు. తను తమిళుడినేనని వివరణ ఇచ్చారు. అయినా విజయ్ సేతుపతిపై ట్రోలింగ్ ఆగడం లేదు.
తాజాగా మరోసారి మురళీధరన్ స్పందించడం ఆసక్తికరంగా మారింది. విజయ్ సేతుపతిని తన బయోపిక్ నుంచి తప్పుకోవాలని కోరుతూ మురళీధరన్ ఓ లేఖని ఈ రోజు విజయ్ సేతుపతికి పంపించారట. దాన్ని ఇయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తమిళ భాషలో ఈ లేఖ వుండటం గమనార్హం. తన బయోపిక్‌లో నటిస్తున్నందున విజయ్ సేతపతికి ఇబ్బందులు తలెత్తే అవకాశం వుందని అందు వల్ల తనని నా బయోపిక్ నుంచి తప్పుకోవాలని అభ్యర్థిస్తున్నానని మురళీధరన్ సదరు లేఖలో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఈ లేఖని షేర్ చేసిన విజయ్ సేతుపతి ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
நன்றி.. வணக்கம் ?? pic.twitter.com/PMCPBDEgAC
— VijaySethupathi (@VijaySethuOffl) October 19, 2020