Homeటాప్ స్టోరీస్విజ‌య్ సేతుప‌తి షాకింగ్ నిర్ణ‌యం!

విజ‌య్ సేతుప‌తి షాకింగ్ నిర్ణ‌యం!

విజ‌య్ సేతుప‌తి షాకింగ్ నిర్ణ‌యం!
విజ‌య్ సేతుప‌తి షాకింగ్ నిర్ణ‌యం!

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి, స్టార్ హీరో విజ‌య్ మంచి స్నేహితులు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు క‌లిసి లోకేష్ క‌న‌క‌రాజ్ తెర‌కెక్కిస్తున్న `మాస్ట‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం విజ‌య్ పుట్టిన రోజున విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇదిలా వుంటే విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్‌ని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం అత‌ను కెన‌డాలో డైరెక్ష‌న్ కోర్స్ చేస్తున్నాడు. క‌రోనా క్రైసిస్ కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో ప్ర‌స్తుతం జాస‌న్ సంజ‌య్ కెన‌డాలోనే చిక్కుకున్నాడు. ఇదిలా వుంటే అత‌న్ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ విజ‌య్ సేతుప‌తి ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తెలుగు సినిమాను ఎంచుకున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం `ఉప్పెన‌`. సుకుమార్ తో క‌లిసి మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బుచ్చిబాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించారు. ఈ చిత్రాన్ని త‌మిళంలోనూ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తే క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డింది. అయితే ఇదే చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేస్తూ విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్‌ని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని విజ‌య్ సేతుప‌తి రీమేక్ రైట్స్‌ని సొంతం చేసుకున్నార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All