Homeటాప్ స్టోరీస్లీకైన సర్కార్ సినిమా

లీకైన సర్కార్ సినిమా

Vijay' s SARKAR online leakedవిజయ్ నటించిన సర్కార్ చిత్రాన్ని పూర్తిగా హెచ్ డి క్వాలిటీ తో రిలీజ్ చేస్తామని చెప్పి సవాల్ విసిరారు తమిళ రాకర్స్ , సవాల్ చేసినట్లుగానే సర్కార్ హెచ్ డి క్వాలిటీ ప్రింట్ ని వెబ్ సైట్ లో పెట్టి సంచలనం సృష్టించారు . గతకొన్ని సంవత్సరాలుగా పైరసి అనేది చిత్ర పరిశ్రమని పట్టి పీడిస్తోంది దాంతో దాన్ని కట్టడి చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు . అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది . ఎప్పటికప్పుడు కొత్త సినిమాని రిలీజ్ చేస్తూ తమ ఆధిపత్యం చాటి చెబుతూనే ఉన్నారు , సవాల్ విసురుతూనే ఉన్నారు పైరసీదారులు . తాజాగా విజయ్ నటించిన సర్కార్ చిత్రాన్ని కూడా మొత్తం ఆన్ లైన్ లో పెట్టేసారు అది కూడా హెచ్ డి క్వాలిటీ కావడంతో వసూళ్ల పై తప్పకుండా ప్రభావం చూపుతుంది .

ఎంతమంది ఆట కట్టించినప్పటికీ తమిళ రాకర్స్ ఆట కట్టించలేకపోతున్నారు . అసలే విజయ్ చిత్రానికి టాక్ అంతగా బాగోలేదు ఆపై మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఇప్పుడు లీకుల గొడవతో వసూళ్లు మందగించడం ఖాయంగా కనిపిస్తోంది . అయితే తమిళనాట సర్కార్ చిత్రానికి డోకా లేదు కానీ మిగతా ఏరియాల్లో మాత్రం సర్కార్ కు గట్టి దెబ్బే పడనుంది .

- Advertisement -

English Title: Vijay’ s SARKAR online leaked

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All