Homeటాప్ స్టోరీస్భారీ ఓపెనింగ్స్ సాధించిన సర్కార్

భారీ ఓపెనింగ్స్ సాధించిన సర్కార్

Vijay' s SARKAR విజయ్ స్టార్ హీరో కావడంతో సర్కార్ చిత్రానికి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అయితే ఆ క్రేజ్ కి తగ్గట్లుగా సినిమా లేకపోవడంతో సినిమాకు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది . నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ సినిమా విడుదల అయ్యింది నిన్ననే కాబట్టి ఓపెనింగ్స్ కి అయితే డోఖా లేకుండా పోయింది . ప్రపంచ వ్యాప్తంగా సర్కార్ సినిమా మొదటి రోజున ప్రీమియర్ షోలతో కలుపుకొని 75 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించింది . ఇంతటి స్థాయి వసూళ్లు అంటే విజయ్ కి ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు .

తమిళనాట విజయ్ హవా ఎక్కువగా ఉంది , దాంతో అక్కడ భారీ వసూళ్లు వస్తున్నాయి . ఇక టాలీవుడ్ లో మాత్రం విజయ్ పప్పులు ఉడకడం లేదు . ఇక్కడ అంతంత మాత్రంగానే వసూళ్లు వస్తున్నాయి . సినిమా అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో సర్కార్ ఫ్లాప్ జాబితాలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది అయితే తమిళనాట మాత్రం హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి . ఎందుకంటే అక్కడ విజయ్ స్టార్ హీరో అలాగే తమిళ వాసన ఉన్న సినిమా కదా అందుకు .

- Advertisement -

English Title : Vijay’ s SARKAR first day collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All