Homeటాప్ స్టోరీస్మన రౌడీ హీరో రెండో స్థానం కొట్టేసాడు!

మన రౌడీ హీరో రెండో స్థానం కొట్టేసాడు!

మన రౌడీ హీరో రెండో స్థానం కొట్టేసాడు!
మన రౌడీ హీరో రెండో స్థానం కొట్టేసాడు!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన పాపులారిటీని ప్రతీ ఏడాదికి పెంచుకుంటూ వెళ్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా విజయవంతం అయినప్పటి నుండి విజయ్ పాపులారిటీ దేశవ్యాప్తంగా పెరిగింది. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజరైబుల్ మెన్ జాబితాలో విజయ్ అగ్రస్థానంలో నిలుస్తున్నాడు. గత రెండేళ్ల నుండి హైదరాబాద్ టైమ్స్ లో టాప్ స్థానంలో నిలుస్తున్నాడు విజయ్ దేవరకొండ.

ఈ ఏడాది విజయ్ దేవరకొండ జాతీయ స్థాయిలో తన రేంజ్ ను చూపించాడు. ఏకంగా టాప్ బాలీవుడ్ స్టార్స్ ను పక్కకు నెట్టి జాతీయ స్థాయిలో తీసిన టాప్ డిజైరబుల్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. మొదటి స్థానంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిలిచాడు. గతేడాది సుశాంత్ చనిపోయిన తర్వాత అతనికి సానుభూతి విపరీతంగా పెరిగింది. అందుకే ఈ ఏడాది ప్రకటించిన జాబితాలో టాప్ స్థానంలో నిలిచాడు.

- Advertisement -

ఆదిత్య రాయ్ కపూర్, విక్కీ కౌశల్, దుల్కర్ సల్మాన్ వరసగా 3,4,5 స్థానాల్లో నిలిచారు. దుల్కర్ సల్మాన్ మలయాళంలో టాప్ స్థానంలో నిలవగా తమిళంలో సెకండ్ ప్లేస్ కొట్టేసాడు. జాతీయ స్థాయిలో ఐదవ స్థానంలో ఉన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All