Homeటాప్ స్టోరీస్తన నిర్మాతకి అదిరిపోయే గిఫ్ట్ పంపిన రౌడీ హీరో

తన నిర్మాతకి అదిరిపోయే గిఫ్ట్ పంపిన రౌడీ హీరో

తన నిర్మాతకి అదిరిపోయే గిఫ్ట్ పంపిన రౌడీ హీరో
తన నిర్మాతకి అదిరిపోయే గిఫ్ట్ పంపిన రౌడీ హీరో

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రంలో నటిస్తున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మాతలుగా లైగర్ అనే చిత్రం రూపొందుతోన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో షూటింగ్ ను ఎనిమిది నెలల్లో పూర్తి చేసి విడుదల చేద్దామనుకున్నారు కానీ ఈ బాక్సింగ్ నేపధ్యమున్న చిత్రం ఏకంగా రెండేళ్లు ఆవుతోన్నా ఇంకా పూర్తి కాలేదు.

సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఈరోజు లైగర్ చిత్ర సహ నిర్మాత ఛార్మి పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మంచి గిఫ్ట్ లను స్పెషల్ గా డిజైన్ చేయించి పంపడం విశేషం.

- Advertisement -

ఒక స్పెషలైజ్డ్ కేక్ తో పాటు మరో గిఫ్ట్ ను కూడా పంపాడు. వీటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All