Homeటాప్ స్టోరీస్కరోనా విషయంలో రెండు కీలక ప్రకటనలు చేసిన రౌడీ హీరో

కరోనా విషయంలో రెండు కీలక ప్రకటనలు చేసిన రౌడీ హీరో

కరోనా విషయంలో రెండు కీలక ప్రకటనలు చేసిన రౌడీ హీరో
కరోనా విషయంలో రెండు కీలక ప్రకటనలు చేసిన రౌడీ హీరో

కరోనా వైరస్ బారిన పడి దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో టాలీవుడ్ ను స్టార్ లు అందరూ తమ వంతుగా ఎంతో కొంత సహాయం చేసి తమ పెద్ద మనసును చాటుకున్నారు. టాప్ స్టార్స్ నుండి మిడ్ రేంజ్ హీరోలు, హీరోయిన్లు కొందరు అటు పీఎం సహాయ నిధికి లేదా ముఖ్యమంత్రుల సహాయ నిధికి తమ విరాళాలను అందించారు. ఇక కొత్తగా క్రియేట్ అయిన కరోనా క్రైసిస్ చారిటీకి డొనేట్ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇంత జరుగుతున్నా కానీ రౌడీ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ స్పందించకపోవడంపై కొంత మంది కావాలనే బురద జల్లే ప్రయత్నం చేసిన విషయం తెల్సిందే.

విజయ్ దేవరకొండ ఇప్పటివరకూ ఎందుకని ఏం దానం చేయలేదని కొందరు డైరెక్ట్ గా అతణ్ణి ట్యాగ్ చేసి మరీ ప్రశ్నించారు. దాత్రుత్వం అనేది పర్సనల్ ఛాయస్. అది ఎవరూ డిమాండ్ చేయకూడదు. అలాంటిది డొనేట్ చేయలేదని ట్రోల్ చేయడం దారుణమే. అయితే విజయ్ దేవరకొండ ఈరోజు తనపై ట్రోల్స్ చేసేవాళ్లు నోళ్లు మూయించాడు.

- Advertisement -

ఈరోజు ఒక 11 నిమిషాల నిడివి ఉన్న వీడియోను రూపొందించి అందులో 2 కీలకమైన ప్రకటనలు చేసాడు. ఈ కరోనా మహమ్మారికి తాను కూడా తయారుగా లేనని తన వద్ద కూడా తగినన్ని ఫండ్స్ లేవని తెలియజేసాడు. అయితే దీని వల్ల నష్టపోయిన వాళ్లకు ఏ విధంగా సహాయం చేద్దామని ఆలోచించి కొంత మంది దగ్గర అప్పుగా తీసుకుని ఫండ్స్ ను సిద్ధం చేసుకున్నానని మొత్తం కరోనా వైరస్ సహాయానికి 1.30 కోట్ల రూపాయల సహాయాన్ని చేయబోతున్నట్లు ప్రకటించాడు. అందులో ఒకటి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా యువతకు తమకు ఆసక్తి ఉన్న రంగంలో ట్రైనింగ్ ఇవ్వడం వంటివి ఉంటాయి. మరొకటి మిడిల్ క్లాస్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేసి నిజంగా అవసరమున్న వారు మాత్రమే https://thedeverakondafoundation.org/ ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ కావాలని, రెండు తెలుగు రాష్ట్రాలలో అవసరమున్న వారికి తన టీమ్ సహాయం చేస్తుందని తెలిపాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All