Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ 'నోటా' డిసెంబర్ లో

విజయ్ దేవరకొండ ‘నోటా’ డిసెంబర్ లో

vijay deverakonda nota will be on christmasగీత గోవిందం చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . తెలుగు , తమిళ బాషలలో రూపొందిన చిత్రం ” నోటా ” . రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంతో విజయ్ తమిళనాట అడుగుపెడుతున్నాడు . షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ఇటీవలే తమిళ డబ్బింగ్ కూడా పూర్తిచేసాడు విజయ్ దేవరకొండ . ఈ హీరోకు మొదటి తమిళ సినిమా అయినప్పటికీ తమిళ్ లో తానే డబ్బింగ్ చెప్పుకొని ఆ చిత్ర యూనిట్ ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు .

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హీరో సూర్య బంధువు జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు కాగా ఈ సినిమాలో పంజాబీ భామ మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది . రాజకీయ రంగానికి సవాల్ విసిరే చిత్రంగా నోటా రూపొందుతోందట ! కాగా ఈ సినిమాని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు అక్కడి నిర్మాతలు . విజయ్ దేవరకొండ కు అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాల తర్వాత అనూహ్యమైన క్రేజ్ వచ్చింది దాంతో నోటా చిత్రానికి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది , ఇక ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: vijay deverakonda nota will be on christmas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts