Homeటాప్ స్టోరీస్80 కోట్ల దిశగా గీత గోవిందం

80 కోట్ల దిశగా గీత గోవిందం

vijay devarakondas geetha govindam towards 80 crores clubవిజయ్ దేవరకొండరష్మిక జంటగా నటించిన గీత గోవిందం చిత్రం విజయడంకా మోగిస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది . మొదటి వారంలోనే దాదాపు 60 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 80 కోట్ల ని చేరుకోవడం పెద్ద కష్టమేమి అనిపించడం లేదు . గీత గోవిందం చిత్ర ప్రభావం కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంది . దాంతో ఓవర్ సీస్ లో సైతం భారీ వసూళ్లు వస్తున్నాయి . దాదాపు 2 మిలియన్ డాలర్లకు చేరువలో ఉంది గీత గోవిందం . ఇక అదే జోరు ని తెలుగు రాష్ట్రాల్లో కూడా చూపిస్తోంది . ఒక్క తెలంగాణలోనే వారం రోజుల్లోనే 10 కోట్ల 70 లక్షల షేర్ సాధించడం సంచలనంగా మారింది .

ఇదే జోరు ఈ వారం కూడా చూపిస్తే తప్పకుండా 80 కోట్ల ని అవలీలగా దాటుతుందని అంటున్నారు . 80 కోట్ల గ్రాస్ సాధిస్తే విజయ్ దేవరకొండ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలుస్తుంది గీత గోవిందం చిత్రం . చిన్న చిత్రంగా వచ్చిన ఈ గీత గోవిందం సంచలనం సృష్టించడంతో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమైంది . ఇక ఈ హీరో స్టార్ లీగ్ లో చేరినట్లే ! వారం రోజులు దాటినప్పటికీ ఇంకా కలెక్షన్లు చాలా చోట్ల స్ట్రాంగ్ గా ఉన్నాయి .

- Advertisement -

English Title: vijay devarakondas geetha govindam towards 80 crores club

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All