Homeటాప్ స్టోరీస్రష్మిక ని కూర్చోబెట్టుకున్న విజయ్ దేవరకొండ

రష్మిక ని కూర్చోబెట్టుకున్న విజయ్ దేవరకొండ

vijay devarakonda geetha govindam first look goes viralనా కాళ్ళకు తిమ్మిర్లు వచ్చినా , నాకు నడుం నొప్పి వచ్చినా సరే నీ బరువు బాధ్యత నాదే అని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మండన తో . తాజాగా ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ” గీత గోవిందం ”. శ్రీరస్తు శుభమస్తు వంటి సక్సెస్ ఫుల్ చిత్రానికి దర్శకత్వం వహించిన పరశురామ్ ఈ గీత గోవిందం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ కు మంచి స్పందన వచ్చింది .

తాజాగా విజయ్ దేవరకొండ – రష్మిక మండన లుక్ రిలీజ్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా చేసారు ఆ చిత్ర బృందం . గీతా ఆర్ట్స్ 2 పతాకంపై ఈ చిత్రం రూపొందింది . ఇటీవలే విజయ్ దేవరకొండ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆసక్తికరమైన సంభాషణ విడుదల చేసారు . అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దాన్నే ఫాలో అవుతున్నారు . తాజాగా విజయ్ దేవరకొండ కాళ్ళ మీద కూర్చున్న రష్మిక స్టిల్ విడుదల చేసి దానికి కూడా మరింత ప్రచారం కలిపించేలా చేసారు . ఇంకేముంది విజయ్ దేవరకొండ తాజా ట్వీట్ కూడా మళ్ళీ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది . ఇదే సంస్థలో విజయ్ టాక్సీ వాలా చిత్రం చేసాడు ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది దాని తర్వాత ఈ గీత గోవిందం విడుదల కానుంది .

- Advertisement -

Engish Title: vijay devarakonda geetha govindam first look goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All