Homeటాప్ స్టోరీస్రౌడీకి అలాంటి అమ్మాయి కావాల‌ట‌!

రౌడీకి అలాంటి అమ్మాయి కావాల‌ట‌!

రౌడీకి అలాంటి అమ్మాయి కావాల‌ట‌!
రౌడీకి అలాంటి అమ్మాయి కావాల‌ట‌!

క‌రోనా కార‌ణంగా యావ‌త్ దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో అంతా ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. బ‌య‌టికి రాకుండా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెబుతున్న రూల్స్‌ని పాటిస్తున్నారు. ఇంటి ప‌ట్టునే వుంటున్నా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వ‌ర‌కు క‌రోనా మ‌హ‌మ్మారిపై వీడియోలు చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్స్‌తో పంచుకుంటున్నారు.

ఇక కొం మంది స్టార్స్ అయితే ప్ర‌త్యేకంగా మీడియా సంస్థ‌ల‌తో మాట్లాడుతున్నారు. కొంత మంది లైవ్ లోకి వ‌స్తుంటే మ‌రి కొంత మందేమో ఫోన్ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫండ్ అంటూ హ‌డావిడి చేస్తూ మ‌ధ్య త‌ర‌గ‌తి ఫ్యామిలీస్‌కి అండ‌గా నిలుస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ జాతీయ మీడియాతో ముచ్చ‌టించార‌ట‌.

- Advertisement -

త‌న పెళ్లి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. త‌ను పెళ్లాడే అమ్మాయికి హాస్య చ‌తుర‌త వుండాల‌ని, ద‌యార్థ హృద‌యురాలు అయి వుండాల‌ని చెప్పుకొచ్చాడ‌ట‌. ఇక పెళ్లి ఎప్పుడ‌ని అడిగితే అందుకు త‌గ్గ మెచ్యూరిటీ త‌న‌కు ఇంకా రాలేద‌ని, లైఫ్‌లో స్థిర‌ప‌డిన త‌రువాత పెళ్లి చేసుకోవాన‌లుకుంటున్నానని, త‌న ఇంట్లో వాళ్లు కూడా ఇదే చెబుతున్నార‌ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All