Homeటాప్ స్టోరీస్ఏడ్చిన విజయ్ దేవరకొండ

ఏడ్చిన విజయ్ దేవరకొండ

vijay deverakonda feel let down, disappointedతన సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో విజయం సాధిస్తుందని సంతోషంగా ఉన్న సమయంలో గీత గోవిందం లోని సన్నివేశాలు కొన్ని లీక్ అయ్యాయని తెలిసి దాదాపుగా ఏడ్చేశాడట హీరో విజయ్ దేవరకొండ . నేను చాలా హర్ట్ అయ్యాను ,నిరాశగా ఉన్నాను ….. కోపం వస్తోంది …….. ఏడ్పు కూడా వస్తోంది అంటూ ట్వీట్ చేసాడు విజయ్ దేవరకొండ . ఇదంతా గీత గోవిందం చిత్రానికి సంబంధించి లీక్ కావడమే !

ఆ చిత్ర టెక్నికల్ బృందం లోని వ్యక్తి గీత గోవిందం చిత్రం లోని కొన్ని సన్నివేశాలను దొంగిలించి వాటిని తన మిత్రులకు పంపించడంతో గుంటూరు లోని 17 మంది కి ఈ ఫుటేజీ చేరింది అది ఫ్రెండ్ సర్కిల్ లో వైరల్ అవుతున్న విషయం గీత గోవిందం చిత్ర బృందానికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు . ఇక రిలీజ్ కి సిద్దమయిన నేపథ్యంలో లీక్ కావడంతో ఆ చిత్ర బృందం షాక్ కి గురయ్యింది ఇక విజయ్ దేవరకొండ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది . కోపంతో ఊగిపోతూ ఏడ్చేశాడట . ఆగస్టు 15న విడుదల కానున్న గీత గోవిందం చిత్రం పై విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకున్నాడు . మరి గీత ఏం చేస్తుందో ?

- Advertisement -

English Title: vijay deverakonda feel let down, disappointed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All