Homeటాప్ స్టోరీస్గీత గోవిందం సీన్స్ లీక్

గీత గోవిందం సీన్స్ లీక్

geetha govindam scenes leakedవిజయ్ దేవరకొండరష్మిక మండన జంటగా నటించిన గీత గోవిందం చిత్రం ఈనెల 15న విడుదల అవుతుండగా ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయని తెలిసి షాక్ అయ్యారు ఆ చిత్ర బృందం . అయితే కాస్త ముందుగానే ఈ విషయం తెలియడం , హార్డ్ డిస్క్ నుండి దొంగిలించిన ఫుటేజీ ని ఇతరులకు షేర్ చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు . ఈమధ్య సినిమా ఫుటేజీ ని కాపాడుకోవడం పెద్ద కష్టంగా మారింది . లీకుల మీద లీకులు అవుతూ దర్శక నిర్మాతలను హీరోలను కలవరపెడుతున్నాయి . గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం దాదాపు సగం లీక్ కాగా ఇప్పుడు కొన్ని సన్నివేశాలు , పాటలు లీక్ అవుతున్నాయి .

ఇక తాజాగా ఓ ఎడిటర్ ఒక గీత గోవిందం సన్నివేశాలను మాత్రమే కాకుండా ఇతర తెలుగు సినిమాల ఫుటేజీ ని కూడా దొంగిలించినట్లు తెలియడంతో సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి అందుకు పాల్పడిన ఎడిటర్ తో పాటుగా మరో 17 మంది స్టూడెంట్స్ ని కూడా అరెస్ట్ చేయడం సంచలనం గా మారింది . విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం లోని ఫుటేజీ లీక్ అయినప్పటికీ అది సర్క్యులేట్ కాకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది . ఇక గీత గోవిందం ఈనెల 15న విడుదల అవుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .

- Advertisement -

English Title: geetha govindam scenes leaked

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All