Homeటాప్ స్టోరీస్విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఓ సెన్సేష‌న్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఓ సెన్సేష‌న్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఓ సెన్సేష‌న్‌!
విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఓ సెన్సేష‌న్‌!

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 2011లో హ‌వీష్ హీరోగా ప‌రిచ‌య‌మైన `నువ్విలా` చిత్రంతో న‌టుడిగా ఎంట్రీ ఇచ్చారు. పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. ఆ త‌రువాత శేఖ‌ర్ క‌మ్ముల రూపొందించిన `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌`లోనూ న‌టించినా స్క్రీన్ స్పేస్ ద‌క్కింది త‌క్కువే. విజ‌య్‌లోని టాలెంట్‌, అత‌ని స‌హ‌జ‌మైన న‌ట‌న‌ని బ‌య‌ట‌పెట్టి న‌టుడిగా గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం నాగ్ అశ్విన్ రూపొందించిన `ఎవ‌డే సుబ్ర‌మణ్యం`.

2015లో వ‌చ్చిన ఈ సినిమాతో రిషి అనే పాత్ర‌తో తిరుగులేని గుర్తింపుని, ఎవ‌రీ విజ‌య్ దేవ‌ర‌కొండ అనేలా అంద‌రూ చ‌ర్చించుకునేలా చేశాడు. ఈ చిత్రంలో పేరుకి నేచుర‌ల్ స్టార్ నాని హీరో అయినా సినిమా మొత్తం విజ‌య్ దేవ‌ర‌కొండ పోషించిన రిషి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. అదే అత‌న్ని `పెళ్లిచూపులు` సినిమాతో హీరోని చేసింది. తొలి చిత్రం జాతీయ స్థాయిలో అవార్డుని సొంతం చేసుకోవ‌డం, ఆ త‌రువాత వ‌చ్చిన `అర్జున్‌రెడ్డి` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవ‌డంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు రీసౌండ్ ఇవ్వ‌డం మొద‌లైంది.

- Advertisement -

ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ వీర విహీరం మొద‌లైంది. `గీత గోవిందం`తో వంద కోట్ల క్ల‌బ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. `నోటా`తో త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యాడు. నిర్మాత‌గానూ అదే విజ‌య్ తొలి అడుగు. సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించింది. టాక్సీవాలా, డియ‌ర్ కామ్రేడ్‌.. ఇలా విభిన్న‌మైన చిత్రాల‌ల్లో న‌టిస్తూ క్రేజీ హీరోగా టాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని చేస్తున్నారు. చార్మి, పూరితో పాటు ఈ చిత్రాన్ని బాలీవుడ్ బిగ్గీస్ క‌ర‌ణ్‌జోహార్‌, అపూర్వ మెహ‌తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. నేడు విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు tollywood.net పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All