Homeటాప్ స్టోరీస్విజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త రికార్డ్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త రికార్డ్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త రికార్డ్‌!
విజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త రికార్డ్‌!

టాలీవుడ్ సంచల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. నోబుల్ కాజ్ కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అండ‌గా నిలుస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ఓ వెబ్ సైట్ విషం చిమ్మడం తాజాగా పును వివాదానికి దారితీసిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు సైట్‌ని బ్యాన్ చేసిన ఇండ‌స్ట్రీ ఫేక్ వార్త‌ల‌పై త్వ‌ర‌లోనే సీరియ‌స్ యాక్ష‌న్‌ని తీసుకోబోతోంది.

ఇదిలా వుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకుని అభిమానుల‌కు ప్రియ‌మైన రౌడీగా మారిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరిఒ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్‌`గా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.  తాజాగా ఆయ‌న‌ సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు.

- Advertisement -

ద‌క్షిణాది హీరోల్లో సోష‌ల్మీడియా ఇన్ స్టా గ్రామ్‌‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ వున్న హీరోగా రికార్డుని నెల‌కొత్పి అగ్ర స్థానంలో నిలిచారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఇన్ స్టాలో ఫాలో అవుతున్న వారి సంక్ష 70 ల‌క్ష‌లు దాటింది. రెండేళ్ల క్రితం 2018 మార్చి 7న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాని ప్రారంభించారు. త‌క్కువ వ్య‌వ‌ధిలోనే 7 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవ‌డం ఓ రికార్డుగా చెబుతున్నారు.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All