Homeటాప్ స్టోరీస్అస‌లు నన్ను విరాళం అడ‌గ‌డానికి మీరెవ‌రు?

అస‌లు నన్ను విరాళం అడ‌గ‌డానికి మీరెవ‌రు?

అస‌లు నన్ను విరాళం అడ‌గ‌డానికి మీరెవ‌రు?
అస‌లు నన్ను విరాళం అడ‌గ‌డానికి మీరెవ‌రు?

విజ‌య్ దేవ‌ర‌కొండ ఎక్క‌డ‌?.. ఆయ‌న సాయం చేయ‌రా?.. అని కొన్ని వెబ్ సైట్‌లు రాశాయి. అస‌లు న‌న్ను విరాళం అడ‌గ‌డానికి అస‌లు మీరెవ‌రు? అని విజ‌య్ దేవ‌ర‌కొండ ఆగ్ర‌హ‌న్ని వ్య‌క్తం చేశారు‌. క‌రోనాపై పోరుకు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖులు త‌మ వంతు గా విరాళాలు అందించారు. సీసీసీ కోసం భారీ స్థాయిలో విరాళాలు అంద‌జేశారు. మ‌రి కొంత మంది సెల‌బ్రిటీలు నేరుగా స‌హాయం అందించారు. ఇదిలా వుంటే ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో వారికి స‌హ‌యం చేయ‌డానికి ఓ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. దీనిపై నాలుగు వెబ్ సైట్లు త‌న‌కు చెడ్డ‌పేరు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌న్నాని, గ‌త కొన్ని రోజులుగా వారి వార్త‌ల్ని గ‌మ‌నిస్తున్నాన‌ని, త‌న పేరుని, కెరీర్‌ని నాశ‌నం చేయాల‌ని స‌ద‌రు వెబ్‌సైట్స్ చూస్తున్నాయ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ సోమ‌వారం ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ‌

ఈ సంద‌ర్భంగా ఓ వీడియోని పోస్ట్ చేశారు. స‌మాజంలో  ప‌క్క‌న వ్య‌క్తిని తొక్కి ముందుకు వెళ్లాల‌నే వాళ్లున్నారు. ఎదుర‌టి వ్య‌క్తి ఏమైపోయినా ఫ‌‌ర్వాలేదు ననేను బాగుండాలి అనుకుంటారు. వీరు స‌మాజంలో వుండ‌టం ప్ర‌మాద‌క‌రం. ఈ రోజు వీరి గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. కొన్న‌పి వెబ్ సైట్స్ విప‌రీతంగా వ‌దంతులు రాస్తున్నాయి. వీరి వ‌ల్ల చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ ఇంకా ఎక్కువ బాధ‌ప‌డుతోంది. మ‌న‌ల్నే వాడి మ‌న‌కు త‌ప్పుడు వార్త‌ల్ని అమ్మి వాళ్లు డ‌బ్బు చేసుకుంటున్నారు. అయినా స‌రే వాళ్ల‌ని ఇన్నాళ్లూ క్ష‌మిస్తూ వ‌చ్చా. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.

- Advertisement -

నాలుగు వెబ్‌సైట్స్ గ‌త కొన్ని రోజులుగా న‌న్ను కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతున్నాయి. విప‌రీత‌మైన ఫేక్ వార్త‌లు రాస్తున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ ఎక్క‌డ?  దాక్కున్నాడా? ‌విజ‌య్‌ దేవ‌ర‌కొండ వేదిక‌పైకి రావాలి. అని రాశారు. వీకిదే నా స‌మాధానం. అస‌లు మీరెవ‌రు న‌న్ను విరాళాలు అడ‌గ‌డానికి?  మీరు బ్ర‌తికేదే మా చిత్ర ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి. ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌క‌పోతే రేటింగ్స్ త‌గ్గిస్తామ‌ని బెదిరింపులు, ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌క‌పోతే మాపై త‌ప్పుడు వార్త‌లు, మీ అభిప్రాయాలు అంద‌రిపై రుద్దుతారు. నాకు న‌చ్చిన‌ప్పుడు.. నాకు అనిపించిన‌ప్పుడు, నాకు కుదిరిన‌ప్పుడు, నాకు ఎవ‌రికి ఇవ్వాల‌నిపిస్తే వారిక‌స్తా. మీకు క‌నీసం ఇంత మాత్రం జ్ఞానం లేదా?

ఏపీ, తెలంగాణ‌లో పేద‌ల కోసం విరాళాలు సేక‌రిస్తున్నాం. రూ. 25 ల‌క్ష‌ల‌తో ప్రారంభించాం. 2 వేల కుటుంబాల్ని ఆదుకోవాల‌ని అనుకున్నాం. కానీ ప్ర‌జ‌లు విప‌రీతంగా విరాళాలు అందిస్తున్నారు. ఇవాళ 70 ల‌క్ష‌లు దాటింది. మా కార్య‌క‌లాపాలు తెలియాల‌ని వెబ్‌సైట్ లో అప్‌డేట్స్ ఇస్తున్నాం. అంద‌రికి స‌హాయం చేసే దిశ‌గా మ‌నం వెళ్తుంటే.. స‌ద‌రు వెబ్‌సైట్లు త‌ప్పుడు వార్త‌లు రాస్తున్నాయి. నేను సేక‌రిస్తున్న విరాళాల్లో గంద‌ర‌గోళం జ‌రుగుతోంద‌ని, హంగామా చేస్తున్నాన‌ని, రాశారు. అంతేకాదు చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి నేను వేరై ఈ ప‌ని చేస్తున్న‌ట్టు పేర్కొన్నాయి` అని విజ‌య్ దేవ‌ర‌కొండ స్ట్రాంగ్ స‌మాధానం చెప్పారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All