Homeటాప్ స్టోరీస్ఆ ఫేక్ న్యూస్‌ని చంపేయండి - విజ‌య్‌దేవ‌ర‌కొండ‌

ఆ ఫేక్ న్యూస్‌ని చంపేయండి – విజ‌య్‌దేవ‌ర‌కొండ‌

ఆ ఫేక్ న్యూస్‌ని చంపేయండి - విజ‌య్‌దేవ‌ర‌కొండ‌
ఆ ఫేక్ న్యూస్‌ని చంపేయండి – విజ‌య్‌దేవ‌ర‌కొండ‌

చేత‌నైతే సాయం చేయాలి.. లేదంటే సాయం చేసేవారికి అండ‌గా వుండి త‌మ వంతు బాధ్య‌త‌గా చేయ‌గ‌లిగింది చేయాలి కానీ కొంత మంది బుర‌ద‌జ‌ల్ల‌డం వంటివి చేస్తుంటారు. ప‌దిమంది చేయాగ‌లిగే సామ‌యం ఒక్క‌డే చేస్తే… ప‌ది మందికి రావాల్సిన ఆలోచిన ఒక్కడికే వ‌స్తే..ఆ ఆలోచ‌న మ‌హ‌త్త‌ర‌మైన‌ది అయితే.. దాన్ని అత‌ను విజ‌య‌వంతంగా ఇంప్లిమెంట్ చేస్తూ సామాజానికి త‌న వంతు బాధ్య‌త‌‌ని నిర్వ‌ర్తిస్తుంటే చూడ‌లేని వాళ్ల‌కి అది జీర్ణం కాదు. జీర్ణించుకోలేరు.

విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలోనూ ఇప్పుడు అదే జ‌రుగుతోంది. ఇండ‌స్ట్రీలో చాలా మంది విరాళాలు ఇస్తున్న వేళ త‌ను ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని నానా యాగీ చేశారు. మ‌హోన్న‌త‌మైన ఆలోచ‌నతో క‌రోనా క్రైసిస్ స‌మాన్య జ‌నం ఇబ్బందులు ప‌డుతుంటే తానున్నానని, మ‌ధ్యత‌ర‌గ‌తి బాధ‌లు త‌న‌కు తెలుస‌ని, వారికి అంగ‌డ‌గా నేనుంటానంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ది దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్ పై మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో ఈ క్రైసిస్ టైమ్‌లో అవ‌స‌రం వున్న ఫ్యామిలీస్‌కు నిత్యావ‌స‌రాలు అందించ‌య‌డానికి ముందుకొచ్చారు. ఓ వెబ్ సైడ్‌ని మొద‌లుపెట్టారు.

- Advertisement -

ఈ నిధికి త‌న వంతుగా విజ‌య్ దేవ‌ర‌కొండ 25 ల‌క్ష‌లు కేటాయించారు. దీనికి దాదాపు 58 ల‌క్ష‌ల వ‌ర‌కు విరాళాలు అందాయి. ఆ మొత్తాన్ని వెచ్చింది ఇప్ప‌టి వ‌ర‌కు 7, 389 కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల్ని వాలంటీర్స్ ద్వారా అందించారు. అయితే స‌హాయం కోసం 77,695 కుటుంబాలు స‌హాయం కోసం రిక్వెస్‌లు పంపించాయి. వారంద‌రికీ నిత్యావ‌స‌రాలు అందించాలంటే దాదాపు 7 కోట్ల వ‌ర‌కు నిధులు కావాలి. ఇదంతా చూస్తున్న కొన్ని వెబ్‌సైట్స్  విజ‌య్‌దేవ‌ర‌కొండ చేస్తున్న ప్ర‌య‌త్నానికి స‌హ‌కారం అందించ‌కపోగా విషం చిమ్మ‌డం మొద‌లుపెట్టాయి. డొనేష‌న్‌ల పేరుతో విజ‌య్ దేవ‌ర‌కొండ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ని అవ‌మానిస్తున్నాడంటూ విమ‌ర్శించ‌డం మొదలుపెట్టాయి.

మంచి ప‌ని చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై బుర‌ద‌జ‌ల్ల‌డంలో భాగంనే కొంత మంది త‌ప్పుడు వార్త‌ల్ని ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ వార్త‌ల‌పై ఆగ్ర‌హించిన విజ‌య్‌దేవ‌ర‌కొండ `కిల్ ఫేక్ న్యూస్‌` అంటూ మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా  సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా ఓ వీడియోని షేర్ చేశారు. బ్లాక్ మెయిలింగ్‌కి పాల్ప‌డుతున్న ఎల్లో జ‌ర్న‌లిస్టుల్ని, ఎల్లో వెబ్ మీడియాల‌ని ఏకిపారేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All