Homeటాప్ స్టోరీస్సిక్స్ ప్యాక్‌తో అద‌ర‌గొట్టేస్తాడ‌ట‌!

సిక్స్ ప్యాక్‌తో అద‌ర‌గొట్టేస్తాడ‌ట‌!

సిక్స్ ప్యాక్‌తో అద‌ర‌గొట్టేస్తాడ‌ట‌!
సిక్స్ ప్యాక్‌తో అద‌ర‌గొట్టేస్తాడ‌ట‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ పేరు `అర్జున్‌రెడ్డి` త‌రువాత టాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. వెర్స‌టైల్ లుక్స్‌తో త‌న యాక్టింగ్ స్కిల్స్‌తో ఓ యాక్ట‌ర్‌గా త‌న క్యాలీబ‌ర్ ఏంటో ఇండ‌స్ట్రీకి.. ప్రేక్ష‌కుల‌కి చూపించి ప్రియ‌మైన రౌడీగా పేరు తెచ్చుకున్నాడు. అయితే గ‌త కొన్ని నెల‌లుగా విజ‌య్ క్రేజ్ త‌గ్గుతోంది. కార‌ణం వ‌రుస ఫ్లాప్‌లు. దీంతో మ‌ళ్లీ త‌న ట్రాక్ లోకి రావాల‌ని కొత్త‌గా ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ నటిస్తున్న తాజా చిత్రం `ఫైట‌ర్‌`. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` త‌రువాత చేస్తున్న సినిమా కావ‌డం, ఈ చిత్రానికి బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూస‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్‌జోహార్ వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం.. ఈ మూవీతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తుండ‌టంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. లాక్‌డౌన్ బిఫోర్ ముంబై వీధుల్లో పూరి ఈ మూవీ కోసం బైక్ ఛేజింగ్ దృశ్యాల‌ని చిత్రీక‌రించారు.

- Advertisement -

తాజాగా ఈచిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ సిక్స్ ప్యాక్ బాడీతో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అది కూడా క్లైమాక్స్‌లో వ‌చ్చే ఒకే ఒక్క సీన్‌లో అని తెలిసింది. ఇందు కోసం గ‌త ఎనిమిది నెల‌లుగా విజ‌య్ క‌ఠోరంగా వ‌ర్క‌వుట్‌లు చేస్తున్న‌ట్టు తెలిసింది. సింగిల్ సీన్ కోసం విజ‌య్ ఇంత‌గా శ్రమిస్తుండ‌టం ఇండ‌స్ట్రీ వ‌ర్గాలని ఆశ్చ‌ర్యప‌రుస్తోంద‌ట‌. `వ‌న్ నే నొక్క‌డినే` మూవీ కోసం మ‌హేష్ కేవ‌లం ఒకే ఒక్క సీన్ కోసం సిక్స్ ప్యాక్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే త‌ర‌హాలో విజ‌య్ ఒక్క సీన్ కోసం సిక్స్ ప్యాక్ లో క‌నిపించ‌నుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All