Homeటాప్ స్టోరీస్విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

భారీ అంచ‌నాలు పెట్టుకున్న‌`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ఫ్లాప్ కావ‌డం హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న త‌దుప‌రి చిత్రం షూటింగ్ ప‌నుల్లో బిజీ అయిపోయాడు. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌ర‌న్‌జోహార్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని వ‌హిస్తున్న చిత్రాన్ని ఫుల్ స్పీడుతో పూర్తి చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్య‌ల‌ర్‌ షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ, అన‌న్య పాండేపై బైక్ ఛేజింగ్ స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ అర్థ్ర రాత్రి ముంబై గ‌ల్లీల్లో చిత్రీక‌రిస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో ఫొటో లీక్ అయింది. సెట్‌లో ఛార్మి కూర్చుని వుండ‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ రొమాంటిక్‌గా అన‌న్య పాండేని కౌగిలించుకుంటున్న ఓ ఫొటో సోష‌ల్ మీడియ‌లో లీక్ అయింది.

- Advertisement -

షూట్‌లో భాగంగా ఈ ఫొటో లీక్ అయిన‌ట్టుగా కాకుండా బోట్‌లో వెళుతుండ‌గా ఈ దృశ్యం సంభ‌వించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. లీక్ అవుతున్న పిక్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేల కెమిస్ట్రీ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేస్తోంది. హీరోహీరోయిన్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వ‌ర్క‌వుట్ చేయాలో పూరికి బాగా తెలుసు. అందుకే లీకులు వ‌దులుతున్నార‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All