Homeటాప్ స్టోరీస్రెండు అవార్డులు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ

రెండు అవార్డులు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
Vijay Devarakonda

సైమా 2019 అవార్డుల కార్యక్రమం దుబాయ్ లో చాలా అట్టహాసంగా జరిగింది . కాగా ఆ వేడుకలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఏకంగా 2 అవార్డులను దక్కించుకున్నాడు . ఒకటేమో గీత గోవిందం చిత్రంలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు అలాగే మరొక అవార్డు సోషల్ మీడియాలో పాపులర్ స్టార్ పేరిట అవార్డు ఇచ్చారు . ఒకేసారి రెండు అవార్డులను అందుకుని సంచలనం సృష్టించాడు విజయ్ దేవరకొండ .

గత ఏడాది విడుదలైన గీత గోవిందం చిత్రంతో స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ . గీత గోవిందం చిత్రంలోని నటనకు గాను క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు విజయ్ దేవరకొండ . సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఈ హీరో ఇటీవలే డియర్ కామ్రేడ్ తో ప్లాప్ చవిచూశాడు కానీ క్రేజ్ లో మాత్రం ఎంత మాత్రం తగ్గలేదు ఈ హీరో ఇమేజ్ . తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All