Homeటాప్ స్టోరీస్ఈ ఏడాది నెంబర్ వన్ విజయ్ దేవరకొండ

ఈ ఏడాది నెంబర్ వన్ విజయ్ దేవరకొండ

vijay devarakonda geetha govindam becomes no 1 in this yearఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలైన చిత్రాలతో పోల్చితే తిరుగులేని బ్లాక్ బస్టర్ కొట్టి చరిత్ర సృష్టించాడు విజయ్ దేవరకొండ. ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం చిత్రం 20 రోజుల్లోనే 60 కోట్ల షేర్ సాధించింది ప్రపంచవ్యాప్తంగా . రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడులో అలాగే కేరళలో ఓవర్ సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధించింది దాంతో 20 రోజుల్లోనే 60 కోట్ల షేర్ వసూల్ అయ్యింది . అయితే ఈ సినిమాకు పెట్టుబడి కేవలం 14 కోట్లు మాత్రమే ! అంటే 14 కోట్ల సినిమాని సొంతం చేసుకున్న వాళ్లకు 45కోట్లతో భీభత్సమైన లాభాలు అన్నమాట !

ఇంకా మంచి వసూళ్లని సాధిస్తోంది కూడా , దాంతో మరో రెండు , మూడు కోట్ల షేర్ వచ్చినా ఆశ్చర్యం లేదు . ఇక మిగతా సినిమాల విషయానికి వస్తే రంగస్థలం , మహానటి ,భరత్ అనే నేను , ఆర్ ఎక్స్ 100 , గూఢచారి తదితర చిత్రాలు కూడా భారీ వసూళ్లని సాధించాయి కానీ గీత గోవిందం లాగా భారీ లాభాలను తెచ్చిపెట్టలేదు . గీత గోవిందం చిత్రానికి అందరికీ కలిపి 50 కోట్ల లాభాలు వచ్చాయి రంగస్థలం చిత్రం కూడా భారీ వసూళ్ల ని సాధించింది 213 కోట్ల గ్రాస్ , 123 కోట్ల షేర్ అయితే ఆ సినిమా బడ్జెట్ 70 కోట్లు అంటే 53 కోట్ల లాభాలు వచ్చాయి కానీ 14 కోట్లతో తీసిన గీత గోవిందం కు కూడా ఎక్కువ డబ్బులు వచ్చాయి కాబట్టి ఈ ఏడాది ఇప్పటివరకు విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రమే నెంబర్ వన్ గా నిలిచింది .

- Advertisement -

English Title: vijay devarakonda geetha govindam becomes no 1 in this year

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All