Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ రికార్డ్ ని బద్దలు కొట్టిన విజయ్ దేవరకొండ

అల్లు అర్జున్ రికార్డ్ ని బద్దలు కొట్టిన విజయ్ దేవరకొండ

Vijay devarakonda beats allu arjuns record in naizamగీత గోవిందం చిత్రంతో పలు రికార్డులు సృష్టిస్తున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ . చిన్న చిత్రంగా వచ్చిన గీత గోవిందం దాదాపు 60 కోట్ల షేర్ సాధించింది ప్రపంచ వ్యాప్తంగా . పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నైజాం లో ఇప్పటికే 20 కోట్ల 20 లక్షల షేర్ ని సాధించి అల్లు అర్జున్ సృష్టించిన రికార్డ్ ని బద్దలు కొట్టాడు . దువ్వాడ జగన్నాథం చిత్రంతో అల్లు అర్జున్ నైజాం లో కింగ్ అయ్యాడు అయితే ఆ రికార్డ్ ని ఇప్పుడు విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రంతో బద్దలుకొట్టాడు . ఒక్క నైజాం లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ల ని సాధించి బయ్యర్లను , నిర్మాతలను లాభాల్లో ముంచెత్తింది .

ఇంతకుముందు తెలంగాణలో టాప్ షేర్ సాధించిన చిత్రాలుగా బాహుబలి ,బాహుబలి 2,రంగస్థలం ,అత్తారింటికి దారేది ,మగధీర ,శ్రీమంతుడు ,దువ్వాడ జగన్నాథం ,ఖైదీ నెంబర్ 150 చిత్రాలు ఉండగా దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని , ఖైదీ నెంబర్ 150 చిత్రాలను వెనక్కి నెట్టేసి 7 వ స్థానాన్ని ఆక్రమించింది గీత గోవిందం . ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన నోటా , టాక్సీ వాలా చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అవుతుండగా అందులో నోటా అక్టోబర్ 5న విడుదల అవుతోంది .

- Advertisement -

English Title: Vijay devarakonda beats allu arjuns record in naizam

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All