Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ఆ సినిమా ఎందుకు చేసాడంటే

విజయ్ దేవరకొండ ఆ సినిమా ఎందుకు చేసాడంటే

Behind the reason of vijay devarakonda actingఇప్పుడు తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న హీరో ఎవరయ్యా అంటే టక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పడం ఖాయం . పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో హాట్ కేక్ అయ్యాడు ఈ హీరో . అయితే విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ అయినప్పటికీ 2011 లో నటించిన మొదటి సినిమా ” నువ్విలా ” . ఆ చిత్రంలో నటించడానికి కారణం ఏంటో తెలుసా …… ఇంతకీ ఆ చిత్రంలో పోషించిన పాత్ర ఏంటో తెలుసా …….. ఎం బి ఏ చదవాల్సి వస్తుందని చదువుకి గుడ్ బై చెప్పి నువ్విలా చిత్రంలో నటించాడు , సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ , అలాగే ఆ చిత్రంలో కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే చేసాడు ఎందుకంటే చదువునుండి తప్పించుకోవడానికి మాత్రమే సుమా !

కట్ చేస్తే నువ్విలా ప్లాప్ అయ్యింది , దాని తర్వాత వేషాల కోసం బాగానే కష్టపడ్డాడు . లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో చిన్న పాత్ర పోషించాడు ఇక ఎవడే సుబ్రహ్మణ్యం తో కాస్త పేరొచ్చింది దాని తర్వాత పెళ్లి చూపులు చిత్రం ఒక్కసారిగా విజయ్ దేవరకొండని వెలుగులోకి తెచ్చింది . ఏడేళ్ల పోరాటం తర్వాత స్టార్ డం వచ్చింది . చదువు నుండి తప్పుకోవడానికి సినిమాల్లో నటిస్తే మొదట ఇబ్బందిపడినప్పటికీ తర్వాత స్టార్ డం ని ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . ఇక తాజాగా నోటా చిత్రం విడుదలకు సిద్దమయ్యింది . దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి .

- Advertisement -

English Title: Behind the reason of vijay devarakonda acting

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All