
అరబిక్ కుతు..అరబిక్ కుతు ఇప్పుడు ఈ సాంగ్ వరల్డ్ వైడ్ గా వైరల్ గా మారింది. తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘బీస్ట్’. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ క్రమంలో వాలంటైన్స్‌డేను పురస్కరించుకొని బీస్ట్ సినిమాలోని ‘అరబిక్ కుతు’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ పాట ఇటీవలే విడుదలై క్షణాల్లో లక్షలాది వ్యూస్ తో దూసుకెళ్లింది. ఇది పూర్తిగా అరబిక్ స్టైల్ సాంగ్. లిరిక్ ని కూడా అరబిక్ అండ్ తమిళ్ మిక్స్ డ్ పదాలతో ఫ్యూజన్ స్టైల్లో అదరగొట్టడంతో జెట్ స్పీడ్ తో వైరల్ అయ్యింది. ఇప్పటికి ఈ పాట 4.7 మిలియన్లకు పైగా లైక్‌లను దాటింది. అలాగే అతి తక్కువ సమయంలో ఈ అరుదైన ఘనతను సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయ పాట ఇదే కావడం విశేషం. అలాగే 175 మిలియన్ల వ్యూస్ తో రికార్డు నెలకొల్పింది.