Homeటాప్ స్టోరీస్విజ‌య్ ఆంటోనీ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తాడా?

విజ‌య్ ఆంటోనీ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తాడా?

విజ‌య్ ఆంటోనీ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తాడా?
విజ‌య్ ఆంటోనీ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తాడా?

`బిచ్చ‌గాడు`.. అండ‌ర్ డాగ్ త‌ర‌హాలో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన చిత్ర‌మిది. విజ‌య్ ఆంటోని హీరోగా న‌టించిన ఈ త‌మిళ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో అనూహ్య విజ‌యాన్ని సాధించి బాక్సీఫీస్ వ‌ద్ద ట్రేడ్ పండితుల్నే విస్మ‌యానికి గురిచేసింది. ల‌క్ష‌ల్లో తెలుగు అనువాద హ‌క్కులు పొందిన వారికి కోట్ల వ‌ర్షం కురిపించింది. దాదాపు 18 కోట్లు ఈ సినిమా తెలుగులో వ‌సూలు చేయ‌డం ఇప్ప‌టికీ ఓ రికార్డుగానే చెబుతారు.

ఊహించ‌ని రీతిలో సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం విజ‌య్ ఆంటోనికి హీరోగా తెలుగులో మంచి మార్కెట్‌ని క్రియేట్ చేసుకునేలా చేసింది. గ‌త కొంత కాలంగా ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానికి సీక్వెల్ రానుందంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. తాజాగా సీక్వెల్ కు సంబంధించిన వార్త‌ని వెల్ల‌డించిన విజ‌య్ ఆంటోని తాజాగా త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా నేడు (శుక్ర‌వారం) `బిచ్చ‌గాడు -2` కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో చిత్ర బృందం రిలీజ్ చేసింది.

- Advertisement -

జాతీయ అవార్డు గ్రహీత ప్రియాంక కృష్ణ స్వామి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `బిచ్చ‌గాడు` చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ ఆంటోని హీరోగా న‌టిస్తూనే సంగీతం అందించ‌నున్నారు. ఫాతిమా విజ‌య్ ఆంటోని స‌మ‌ర్ప‌ణ‌లో విజ‌య్ ఆంటోని పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. `బిచ్చ‌గాడు` త‌ర‌హాలో ఈ సీక్వెల్ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All