Homeటాప్ స్టోరీస్పారితోషికం త‌గ్గించుకున్న విజ‌య్ ఆంటోని!

పారితోషికం త‌గ్గించుకున్న విజ‌య్ ఆంటోని!

 

పారితోషికం త‌గ్గించుకున్న విజ‌య్ ఆంటోని!
పారితోషికం త‌గ్గించుకున్న విజ‌య్ ఆంటోని!

విజ‌య్ ఆంటోని.. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు. గాయ‌కుడిగా, గేయ ర‌చ‌యిత‌గా, ఎడిట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. `బిచ్చ‌గాడు` చిత్రంతో హీరోగా త‌మిళ‌నాడుతో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో పాపుల‌ర్ అయ్యారు. తెలుగులోనూ మంచి మార్కెట్‌ని సొంతం చేసుకున్నారు. అయితే గ‌త కొంత కాలంగా రేసులో వెన‌క‌బ‌డ్డారు.

- Advertisement -

తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో చిత్ర ప‌రిశ్ర‌మలో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న పారితోషికాన్ని త‌గ్గించుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇలా ప్ర‌క‌టించిన తొలి న‌టుడిగా వార్త‌ల్లో నిలిచారు. నిర్మాత‌ల‌కు అండ‌గా వుండాల‌ని ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేషం.

లాక్‌డౌన్ కార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ భారీ న‌ష్టాల‌ని చ‌విచూస్తోంది.  ఈ ఏడాది చాలా మంది ప‌న‌రి కోల్పోయే అకాశాలే అత్య‌ధికంగా వున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో  ముందుగా విజ‌య్ ఆంటోని స్పందించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. విజ‌య్ ఆంటోని ప్ర‌స్తుతం త‌మిళంలో ఆరు చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఒక‌టి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌‌శ‌లో వుండ‌గా రెండు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. మూడు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో వున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All