Homeటాప్ స్టోరీస్సూప‌ర్‌హిట్‌ సీక్వెల్‌కు క‌థ అందిస్తున్న హీరో!

సూప‌ర్‌హిట్‌ సీక్వెల్‌కు క‌థ అందిస్తున్న హీరో!

సూప‌ర్‌హిట్‌ సీక్వెల్‌కు క‌థ అందిస్తున్న హీరో!
సూప‌ర్‌హిట్‌ సీక్వెల్‌కు క‌థ అందిస్తున్న హీరో!

సంగీత ద‌ర్శ‌కుడు, హీరో విజ‌య్ ఆంటోని హీరోగా న‌టించి చిత్రం `బిచ్చ‌గాడు`. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. వ‌సూళ్ల ప‌రంగానూ ట్రేడ్ వ‌ర్గాలని విస్మ‌యానికి గురిచేసింది. హీరోగా విజ‌య్ ఆంటోనికి ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళంలోనూ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

2016లో సాదాసీదా సినిమాగా రిలీజైన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధించి స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది. గ‌త కొంత కాలంగా ఈ సినిమాకు సీక్వెల్‌ని చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. తాజాగా దీని కోసం హీరో విజ‌య్ ఆంటోనీ క‌థ‌ని సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల హీరో విజ‌య్ సేతుప‌తి వెల్ల‌డించారు.

- Advertisement -

`గ‌త నాలుగు నెల‌ల నుంచి సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే ప‌నిలో వున్నాను. ప్ర‌స్తుతం స్క్రిప్ట్  ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల‌తో పాటు సాంకేతిక వ‌ర్గాన్ని వెల్ల‌డిస్తాను` అని హీరో విజ‌య్ సేతుప‌తి వెల్ల‌డించారు. ఈ సీక్వెల్‌ని సొంత నిర్మాణ సంస్థ‌లోనే నిర్మించే అవ‌కాశం వున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All