Homeటాప్ స్టోరీస్వెంకీ మామ టార్గెట్ రీచ్ అవ్వగలడా?

వెంకీ మామ టార్గెట్ రీచ్ అవ్వగలడా?

వెంకీ మామ టార్గెట్ రీచ్ అవ్వగలడా?
వెంకీ మామ టార్గెట్ రీచ్ అవ్వగలడా?

థియేటర్ల వద్ద సినిమాలు సందడి చేసి చాలా కాలమైంది. దసరా తర్వాత పేరున్న సినిమా థియేటర్లలో విడుదలైంది లేదు. అర్జున్ సురవరం ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది విపరీతమైన బజ్ తీసుకొచ్చిన సినిమా కాదు. అయితే పెద్ద సినిమా లేని లోటును ఇప్పుడు వెంకీ మామ భర్తీ చేయనుంది. డిసెంబర్ 13కి ఈ సినిమా విడుదలవుతోంది. యూఎస్ లో ఇప్పటికే బుకింగ్స్ మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సందడి మొదలైంది.

ఎఫ్ 2 వంటి భారీ సక్సెస్ తర్వాత వెంకీ చేస్తున్న చిత్రం, మజిలీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న చిత్రం, జై లవకుశ వంటి సక్సెస్ తర్వాత బాబీ చేస్తున్న చిత్రం కావడంతో వెంకీ మామ పై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా నాగ చైతన్య, వెంకటేష్ కలిసి ఒక సినిమాలో ఇంతసేపు నటించడం ఇదే తొలిసారి. ప్రేమమ్ లో వెంకటేష్ ఒక కెమియో చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. నిజ జీవితంలోనూ మామ అల్లుళ్లు అయిన చైతూ, వెంకీ వెంకీ మామలో కూడా అవే పాత్రలు పోషించడంలో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అన్ని ఎమోషన్స్ కలగలిపిన సినిమా అయ్యుంటున్నదన్న భావన కలిగించడంలో సక్సెస్ అయింది.

- Advertisement -

ఇలా అన్నీ పాజిటీవ్ గా ఉన్న వెంకీ మామ కు టార్గెట్ మాత్రం భారీగానే ఉంది. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే దాదాపు 32 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇదేమంత కష్టమైన విషయం కాకపోవచ్చు. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు 30 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇందులో నైజాం మాత్రమే 8 కోట్లు పలకడం విశేషం. ఇక సీడెడ్ ను 5.5 కోట్లకు కొనుగోలు చేశారు. మిగతా ఆంధ్రా హక్కులను 13 కోట్లకు అమ్మారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుండే దాదాపుగా 27 కోట్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 2.5 కోట్లకు, ఓవర్సీస్ 2.5 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. సురేష్ బాబు వరకూ ఈ చిత్రంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. టేబుల్ ప్రాఫిట్స్ తో దీన్ని విడుదల చేస్తున్నాడు. నాన్ థియేట్రికల్ రైట్స్ కు కూడా భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. మరి వెంకీ మామ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All