Homeగాసిప్స్వెంకీ మామ సినిమా స్టోరీ ఇదేనా..?

వెంకీ మామ సినిమా స్టోరీ ఇదేనా..?

Venky Mama Story Predicted By Young Writer
Venky Mama Story Predicted By Young Writer

విక్టరీ వెంకటేష్ & యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ రిలీజ్ కి రెడీ అయిన సినిమా “వెంకీ మామ.” గతంలో “లవ కుశ” లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన K.S రవీంద్ర (బాబీ) ఈ సినిమాకు దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్ చాలా భారీగా ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా రీలీజ్ అయిన ట్రైలర్ సూపర్ గా ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఒక ఊరిలో ప్రాణానికి ప్రాణంగా కలిసిమెలిసి ఉంటారు మేన మామ అల్లుడు; వెంకటేష్ మరియు నాగ చైతన్య. అల్లుడు సొంత ఆలనా పాలనా చూసుకుంటూ తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోవడం మానేశాడు వెంకీ మామ.

- Advertisement -

ఆ ఊర్లో వాళ్లకి ఎదురులేదు తిరుగులేదు. అయితే ఉన్నట్టుండి ఇద్దరి జీవితాల్లోకి ఇద్దరమ్మాయిలు ప్రవేశిస్తారు. వారిలో అల్లుడు ప్రేమించిన అమ్మాయి కుటుంబం మామా అల్లుళ్ళు (నాగ చైతన్య వెంకటేష్) కలిసి ఉంటే, తమ అమ్మాయి (రాశీ ఖన్నా) ని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఒప్పుకోరు. మేనమామ అల్లుడు ఇద్దరూ విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటేనే, తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు ఆ పెద్దమనిషి(నాజర్).

ఈలోగా తన జీవితాన్ని పట్టించుకోవడం మానేసిన మేనమామకు, ఎలాగైనా పెళ్లి చేయాలని ఆ ఊరికి స్కూల్ టీచర్ గా వచ్చిన వెన్నెల (పాయల్ రాజ్ పుత్) తో మేనమామకి పెళ్లి చేసి, వాళ్ళిద్దర్నీ జంటగా చూడాలనుకుంటాడు, అల్లుడు (నాగ చైతన్య). ఇలా ఎవరికి వాళ్లు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నప్పుడు అనుకోకుండా అల్లుడు కార్తీక్ శివరాం మిలటరీలో కి వెళ్ళవలసి వస్తుంది. అలా మిలట్రీ లోకి వెళ్ళిన అతనొక ఆపరేషన్ నిమిత్తం సరిహద్దు దాటి అవతల దేశం లోకి వెళ్లి అనుకోకుండా అక్కడ శత్రుదేశం చేతిలో బందీ అయిపోతాడు.

అల్లుడు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్న మేనమామ, అప్పటికే తన అల్లుడు మూడు సంవత్సరాల నుంచి కనపడకపోవడంతో, మిలటరీ అధికారి(ప్రకాష్ రాజ్ ) యొక్క సహాయంతో స్పెషల్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకొని శత్రువుల చేతిలో బందీ అయిపోయిన తన మేనల్లుడి విడిపించుకోవడం లక్ష్యంగా మరియు సగంలో ఆగిపోయిన మిలటరీ ఆపరేషన్ పూర్తి చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకుంటాడు.

  • మరి ప్రాణాలకు తెగించి మేనమామ చేసిన ఈ రిస్క్ లో అల్లుడు తనకి దక్కాడా.?
  • అల్లుడు ప్రేమించిన అమ్మాయి మరియు మేనమామ ని ప్రేమించిన అమ్మాయిల పెద్దలను ఒప్పించి వీళ్ళు ఎలా “కోకో కోలా పెప్సీ మామ అల్లుడు సెక్సీ” అని అనిపించుకున్నారు.? అనేది బ్యాలెన్స్ కథ.

ఇది ఎవరో చెప్తే రాసింది కాదు. నేనే రాసా. దయచేసి ఈ సినిమాకి రైటర్ గా వర్క్ చేసిన జనార్ధన్ మహర్షి గారు మరియు సినిమా డైరెక్టర్ కె రవీంద్ర బాబు గారు ఇది చూసి “అంతేగా అంతేగా” అంటే అది చాలు నాకు. నమస్కారం

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All