Homeటాప్ స్టోరీస్వెంకీ మామ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్

వెంకీ మామ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్

వెంకీ మామ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్
వెంకీ మామ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కిన వెంకీ మామ డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సంగతి తెల్సిందే. ఈ సినిమాకు మొదట మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే వెంకటేష్ స్టార్ పవర్ కు తోడు, వెంకీ-చైతూ కాంబినేషన్ క్రేజ్ తోడవ్వడంతో ఈ చిత్రం గట్టెక్కింది. వెంకీ మామ ఫైనల్ గా సంతృప్తికర సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 31 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 36 కోట్లకు బిజినెస్ జరిగింది. అయితే వెంకీ మామ ఫైనల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 33 కోట్లు, ఫైనల్ రన్ లో దాదాపుగా 40 కోట్లు వసూలు చేసి హిట్ ను సొంతం చేసుకుంది.

టాక్ బాగుండి ఉంటే ఈ సినిమా మరింత పెద్ద విజయం సాధించేది అనడంలో సందేహం లేదు. వెంకటేష్ ఈ చిత్రానికి స్టార్ పుల్లర్ గా నిలిచాడు. దానికి తోడు థమన్ సంగీత దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉండడం కూడా కలిసొచ్చింది. దాదాపు నెలన్నర తర్వాత ఒక పెద్ద సినిమా విడుదలవడంతో అప్పటిదాకా మంచి సినిమా కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు వెంకీ మామ ఓన్లీ ఛాయస్ గా నిలిచింది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ సినిమాకు అనుకూలంగా పనిచేయడం వల్ల వెంకీ మామ హిట్ అయింది.

- Advertisement -

వెంకీ మామ క్లోజింగ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:
నైజాం : Rs  13.03 Cr
సీడెడ్ : Rs  4.51 Cr
ఉత్తరాంధ్ర : Rs  5.62 Cr
గుంటూరు : Rs 2.72 Cr
కృష్ణ : Rs 1.83 Cr
ఈస్ట్ గోదావరి : Rs  2.61 Cr
వెస్ట్ గోదావరి : Rs 1.42 Cr
నెల్లూరు : Rs 1.10 Cr
ఆంధ్ర + తెలంగాణ : Rs 32.84 Cr Shares
రెస్ట్ ఆఫ్ ఇండియా : Rs 3.30 Cr
ఓవర్సీస్ : Rs 3.20 Cr
వరల్డ్ వైడ్ : Rs 39.34 Cr షేర్స్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All