
ఎప్పుడూ కూల్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లే విక్టరీ వెంకటేష్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక కామెంట్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. వెంకటేష్ ఇన్ స్టాగ్రాం లో పెట్టిన ఒక కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ వెంకటేష్ ఏం పెట్టాడు అంటే.. మనం ఏదైనా విషయంపై నోరు తెరిచి మాట్లాడే ముందు దాని గురించి బుర్ర పెట్టి ఆలోచించాలి అంటూ కామెంట్ పెట్టాడు. వెంకటేష్ ఇలా పెట్టడానికి కారణం నాగ చైతన్య, సమంత డైవర్స్ కు సంబందించే అని కొందరు అంటున్నారు.
నాగ చైతన్య, సమంత విడాకులపై మీడియా చేస్తున్న అతిని చూసి వెంకటేష్ ఇలా స్పందించి ఉంటారని అంటున్నారు. ఇండస్ట్రీలో ఎంత పెద్ద గొడవ అవుతున్నా సరే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన దారి తనదే అన్నట్టు సైలెంట్ గా ఉండే వెంకటేష్ మొదటిసారి మనం ఏదైనా మాట్లాడే ముందు మైండ్ వాడాలంటూ చెప్పిన కొటేషన్ ఎవరిని ఉద్దేశించి అన్నాడు అన్నది కన్ ఫ్యూజన్ గా మారింది.
వెంకటేష్ అన్నది ఎవరినైనా ఆయన అన్న కామెంట్ మాత్రం నిజమని అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్3 సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆయన నటించిన దృశ్యం 2 రిలీజ్ కు రెడీగా ఉంది.