Homeన్యూస్`వీడు అసాధ్యుడు` షూటింగ్ ప్రారంభం!!!

`వీడు అసాధ్యుడు` షూటింగ్ ప్రారంభం!!!

veedu asadhyudu movie openingMSK ప్ర‌మిద శ్రీ ఫిల్మ్స్ ప‌తాకంపై కృష్ణ సాయి, జ‌హీదా శామ్ జంట‌గా ఎమ్ఎస్‌కే రాజు నిర్మిస్తోన్న చిత్రం `వీడు అసాధ్యుడు` . (ఆన్ అఛీవ‌ర్ ట్యాగ్ లైన్‌) . పియ‌స్ నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం ఈ రోజు ఫిలిం న‌గ‌ర్ లోని మాదాల ర‌వి హౌస్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా అధ్య‌క్షుడు శివాజీరాజా ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ప్ర‌ముఖ నిర్మాత సీతారామ‌రాజు కెమెరా స్విచాన్ చేశారు. న‌టుడు శివ‌కృష్ణ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ద‌ర్శ‌కుడు పియ‌స్ నారాయ‌ణ మాట్లాడుతూ…“ఇది నా తొలి చిత్రం. కృష్ణ సాయి గారు నాకు ప‌దేళ్లుగా తెలుసు. వారు క్రిమిన‌ల్ లాయ‌ర్ గా ప‌ని చేస్తున్నారు. హీరోగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్ర‌మిది. ఒక క‌మ‌ర్షియ‌ల్ అంశానికి సోష‌ల్ మెజేస్ జోడించి రూపొందిస్తోన్నాం. ఇందులో ల‌వ్, కామెడీ, యాక్ష‌న్ ఇలా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అంశాలుంటాయి. హీరో అడ్వ‌కేట్ గా న‌టించారు. హీరోయిన్ ఒక ఎన్ ఆర్ ఐ పాత్ర‌లో న‌టిస్తోంది. వీరిద్ద‌రికీ ఎలా ప‌రిచ‌యం అయింది. ఆ ప‌రిచ‌యం ఎలాంటి మ‌లుపుల‌కు దారి తీసింద‌న్న‌ది ఆస‌క్తిక‌రమైన అంశం. సెప్టెంబ‌ర్ మూడో వారంలో షూటింగ్ ప్రారంభించి డిసెంబ‌ర్ క‌ల్లా పూర్తి చేయ‌నున్నాం“ అన్నారు.

- Advertisement -

హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ…“నేను హీరోగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్ర‌మిది. గ‌తంలో నేన పోలీస్ డిపార్టె మెంట్ పై ఒక వీడియో పియ‌స్ నారాయ‌ణ గారి ద‌ర్శ‌క‌త్వంలో ఒక వీడియో సాంగ్ చేశాను. దానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆ ఇన్ స్పిరేష‌న్ తో ఈ సినిమా నిర్మిస్తున్నా. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.

హీరోయిన్ జ‌హీదా శామ్ మాట్లాడుతూ…“తెలుగులో నా ఫస్ట్ ఫిలిం ఇది. నా క్యార‌క్ట‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతంః శంభు ప్ర‌సాద్‌, మాట‌లుః త్యాగ‌రాజ్ ; సినిమాటోగ్ర‌ఫీః విజ‌య్ కుమార్ అడుసుమిల్లి; ఆర్ట్ డైరెక్ట‌ర్ః పి.వి.రాజు; ఎడిట‌ర్ః ముర‌ళి; కో- డైరెక్ట‌ర్ః కృష్ఱ‌శ్యామ్; డాన్స్ః కిర‌ణ్ ; ఫైట్స్ః మార్ష‌ల్ ర‌మ‌ణ‌; మేక‌ప్ః హ‌రి; కాస్ట్యూమ్స్ఃమ‌ణికంఠ; ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః టి. స‌తీష్ బాబు; నిర్మాతః MSK రాజు ; క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః పి.య‌స్‌.నారాయ‌ణ‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All