
విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ తొలిసారి కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఎఫ్2`. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో వంద కోట్లు వసూలు సాధించి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. కేవలం 30 కోట్ల లోపు బడ్జెట్‌తో ఈ చిత్రాన్నినిర్మించారు. అయితే ఈసారి మాత్రం ఈ మూవీకి సీక్వెల్ గా రూపొందనున్న `ఎఫ్3`కి 50కి మించి ఖర్చు చేయబోతున్నారట.
దీంతో ఈ మూవీకి భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే సరికొత్త హంగులతో సీక్వెల్‌ని తెరపైకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. సీక్వెల్‌లోపూ వెంకటేష్, వరుణ్‌తేజ్ నటించనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ రెండవ వారం నుంచి ఈ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ విషయంలో హీరో వరుణ్‌తేజ్ నిర్మాత దిల్‌రాజుకు భారీ ఝలక్ ఇచ్చినట్టు తెలిసింది.
ఈ చిత్రం కోసం వరుణ్‌తేజ్ భారీగా డిమాండ్ చేస్తున్నారట. అంత మొత్తం ఇస్తేనే తాను నటిస్తానని నిర్మాత దిల్ రాజుకు చెప్పినట్టు తెలిసింది. అయితే దిల్ రాజు మాత్రం కరోనా సాకుతో పారితోషికాల్లో కోతలు విధిస్తున్నారట. ఈ నేపథ్యంలో `ఎఫ్3` అనుకున్న సమయానికే మొదలవుతుందా? లేక వాయిదా పడుతుందా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది.