Homeటాప్ స్టోరీస్ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడా

ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడా

vakkantham vamsi teamup with ravitejaఅల్లు అర్జున్ హీరోగా నటించిన ” నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ” చిత్రానికి దర్శకత్వం వహించిన వక్కంతం వంశీ కి మాస్ మహారాజ్ రవితేజ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం . దాంతో ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు అందరూ షాక్ అవుతున్నారు రవితేజ ఏంటి ? ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం ఏంటి ? ఇప్పటికే అల్లు అర్జున్ ఘోర తప్పు చేసి డిజాస్టర్ ని మూటగట్టుకొని బాధపడుతున్నాడు . అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేదని వక్కంతం వంశీ పై విమర్శలు కూడా భారీ ఎత్తున వచ్చాయి అయితే ఇప్పుడేమో ఏకంగా సక్సెస్ లో లేని రవితేజ వక్కంతం వంశీ కి ఛాన్స్ ఇచ్చాడని తెలిసి షాక్ అవుతున్నారు .

అయితే ప్రస్తుతం వినబడుతున్న సమాచారం మాత్రమే అంతేకాని రవితేజ అధికారికంగా ప్రకటించలేదు . వక్కంతం వంశీ కి మొదట డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి తప్పుకున్నాడు ఎన్టీఆర్ దాంతో అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చాడు కట్ చేస్తే రిజల్ట్ ఏంటి అన్నది అందరికీ తెలిసిందే . రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం చేస్తున్నాడు . వాటి తర్వాత పలు చిత్రాలు లైన్ లో ఉన్నాయి కాగా అందులో వక్కంతం వంశీ కూడా ఉన్నాడని అంటున్నారు . రచయితగా సక్సెస్ కొట్టిన వక్కంతం వంశీ దర్శకుడిగా సక్సెస్ కొడతాడా ? లేదా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All