Homeటాప్ స్టోరీస్`వ‌కీల్ సాబ్‌` మూవీ రివ్యూ

`వ‌కీల్ సాబ్‌` మూవీ రివ్యూ

`వ‌కీల్ సాబ్‌` మూవీ రివ్యూ
`వ‌కీల్ సాబ్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, శృతిహాస‌న్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల‌, వంశీకృష్ణ‌, న‌రేష్‌, ముఖేష్‌రుషి, దేవ్ గిల్‌, సుబ్బ‌రాజు త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం : శ్రీ‌రామ్ వేణు
నిర్మాత‌లు  :  దిల్ రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ  :  బోనీ క‌పూర్‌
సంగీతం :  త‌మ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం :  పీఎస్ వినోద్‌
ఎడిటింగ్‌ :  ప్ర‌వీణ్ పూడి
రిలీజ్ డేట్ : ఏప్రిల్ 9, 2021
రేటింగ్ ‌: 3/5

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా వ‌చ్చి మూడేళ్ల‌వుతోంది. థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ పూన‌కాల‌కి.. కేరింత‌ల‌కి కూడా మూడేళ్ల‌వుతోంది. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల‌కు పండ‌గ వస్తే.. అది కూడా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాతో వ‌స్తే ఆ సంబ‌రం గురించి మాట‌ల్లో చెప్ప‌లేం. ప్ర‌స్తుతం ఇదే అనుభూతికి ప‌వ‌న్ ఫ్యాన్స్ లోన‌వుతున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `వ‌కీల్ సాబ్‌` చిత్రం ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డం మొద‌లుపెట్టింది. దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌చ్చిన ఈ చిత్రం అభిమానుల‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుందా? .. దాదాపు మూడేళ్లుగా ప‌వ‌న్ అభిమానుల ఎదురుచూపుల‌కు త‌గ్గ‌ట్టుగానే `వ‌కీల్ సాబ్‌` వుందా? అన్నది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
జ‌రీనా (అంజ‌లి), ప‌ల్ల‌వి (నివేదా థామ‌స్‌), దివ్య నాయ‌క్‌ (అన‌న్య) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌తులైన ఈ ముగ్గురు స్నేహితులు. హైద‌రాబాద్ లో జాబ్స్ చేస్తుంటారు. ఓ రోజు రాత్రి పార్టీలో పాల్గొన్న ఈ ముగ్గురు యువ‌తులు అనుకోకుండా వంశీ (వంశీకృష్ణ‌) గ్యాంగ్‌తో అత‌ని రిసార్ట్‌కి వెళ్లాల్సి వ‌స్తుంది. అయితే అక్క‌డ జ‌రిగిన ఓ సంఘ‌ట‌న వాళ్ల జీవితాల్లో క‌ల్లోలం సృష్టిస్తుంది. ప‌ల్ల‌విని జైలు పాలు చేస్తుంది. ఈ క్ర‌మంలోనే మిగ‌తా ఇద్ద‌రి జీవితం కూడా అగ‌మ్య‌గోచ‌రంగా మారుతుంది. ఎంపీ కొడుకు వంశీ కార‌ణంగా మ‌రింత ప్ర‌మాదంలో ప‌డుతుంది. ఏ దిక్కూ లేని వీరికి వ‌కీల్‌సాబ్ స‌త్య‌దేవ్ అండ‌గా నిలుస్తాడు. ఈ క్ర‌మంలో అత‌నికి ఎదురైన స‌వాళ్లేంటీ? .. నందాతో వ‌కీల్‌సాబ్ ఎలా ఫైట్ చేశాడు. అత‌ని వెనకున్న ఎంపీ ఎవ‌రు? ‌వారంద‌రినీ త‌ట్టుకుని స‌త్య‌దేవ్ అభాగ్యులైన ముగ్గురు ఆడ‌వాళ్లకు ఎలా న్యాయం చేశాడు? ..త‌ను న్యాయ‌వాద వృత్తికి కొంత కాలం దూరంగా వుండ‌టానికి కార‌ణం ఏంటీ?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:
మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన చిత్ర‌మిది కావ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ప‌వ‌ర్‌స్టార్ స‌త్య‌దేవ్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. త‌న చిత్రాల్లో హీరోయిన్‌ని డిగ్నిఫైడ్‌గా చూపించ‌డానికి ఇష్ట‌డుతూ వ‌వారికి ప్ర‌ధాన్య‌త‌నిచ్చే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌హిళా సాధికార‌త నేప‌థ్యంలో రూపొందిన `వ‌కీల్‌సాబ్‌`లోనూ త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో విజిల్స్ వేయించారు. ఆయ‌న పాత్ర‌ని మ‌లిచిన విధానం, కోర్టు రూమ్‌లో ప్ర‌కాష్‌రాజ్‌కు త‌న‌కు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లో ప‌వ‌న్ ఓ పవ‌ర్ హౌస్‌గా క‌నిపించిన తీరు అభిమానుల‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో శృతి కోసం క‌న్నీళ్లు పెట్టే స‌న్నివేశాల‌తో పాటు కోర్టులో జ‌రిగే భావోద్వేగ భ‌రిత సీన్‌ల‌లోనూ ప‌వ‌ర్ అద‌ర‌గొట్టారు. ఓ ద‌శ‌లో భిమానుల‌కి కూడా క‌న్నీళ్లు తెప్పించారు. క్రిమిన‌ల్ లాయ‌ర్ నందాగా ప్ర‌కాష్‌రాజ్ కూడా ప‌వ‌న్‌తో పోటీప‌డ్డారు. ఇక కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల త‌మ త‌మ పాత్ర‌ల్లో అద్భుతంగా రాణించారు.

సాంకేతిక నిపుణులు:
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన వ్య‌క్తి ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణు. రెండే రెండు చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా యావ‌రేజ్ టాక్‌ని సొంతం చేసుకున్న త‌న‌కి ప‌వ‌న్‌కల్యాణ్ రీఎంట్రీ మూవీని డైరెక్ట్ చేసే అవ‌కాశం రావ‌డంతో ఈ అవకాశాన్ని ఓ అభిమానిగా పూర్తి స్థాయిలో వినియోగించుకుని త‌న బెస్ట్‌ని అందించే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ త‌రువాత ఇదే త‌ర‌హాలో ఫ్యాన్‌గా ఫీలై అందివచ్చిన అవ‌కాశాన్ని త‌న‌దైన పంథాలో స‌ద్వినియోగం చేసుకున్నారు త‌మ‌న్‌. నేప‌థ్య సంగీతంతో పాటు పాట‌ల‌తో త‌నకు ప‌వ‌న్‌పై వున్న అభిమానాన్ని చాటుకున్నారు. పీఎస్ వీనోద్ ఫొటోగ్ర‌ఫీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న వ‌ర‌కు బెస్ట్ విజువ‌ల్స్ అందించారు. ఇటీవ‌లే జాతీయ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్న న‌వీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ అందించాడు. ఇక  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. 25 ఏళ్ల డ్రీమ్‌ని నిజం చేసిన సినిమా కావ‌డం, ప‌వ‌న్ న‌టించ‌డంతో ఎక్క‌డా రాజీప‌డ‌లేదు.

తీర్పు:
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మూడేళ్ల విరామం త‌రువాత చేసిన సినిమా ఇది. ఇంత కాలంగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల‌కు `వ‌కీల్‌సాబ్‌` ఓ విదు భోజ‌నం లాంటి సినిమా. ఆక‌లి మీదున్న పులికి అన్న‌చందంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వెండితెర‌పై ప‌వ‌న్ మెస్మ‌రైజింగ్ పెర్ఫార్మెన్స్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూసిన వారికి `వ‌కీల్ సాబ్‌` ఓ పండ‌గని తీసుకొచ్చిందని చెప్పాలి. మ‌హిళా సాధికార‌త‌ని, సంఘంలో, స‌మాజంలో మ‌హిళ‌లకు ఇవ్వాల్సిన గౌర‌వాన్ని చాటిచెప్పిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద చ‌రిత్ర సృష్టించడం ఖాయం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All