
కరోనా గత ఏడాది కాలంగా సర్వ మానవాళిని అతలాకుతలం చేస్తోంది. గత ఏడాది మార్చిలో భారత్‌లో మొదలైన కరోనా తాజాగా సెకండ్ వేవ్ మొదలైంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ స్టార్స్ కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.
అలియాభట్ ఇటీవల కరోనా బారిన పడన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇదిలా వుంటే తాజాగా `వకీల్‌సాబ్` చిత్రంలో నటించిన నివేదా థామస్ కరోనా బారిన పడింది. ఇటీవలే అంజలి, అనన్య నాగళ్లతో కలిసి ప్రసాద్ ల్యాబ్‌లో డబ్బింగ్ పూర్తి చేసిన నివేదా థామస్ కరోనా బారిన పడినట్టు వెల్లడించింది.
`నాకు కరోనా పాజిటివ్ అని నిర్ణారణ అయింది. ప్రస్తుతం సెల్ఫ్ క్వారెంటైన్‌లో వున్నాను. డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వస్తాను. నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మెడికల్ టీమ్‌కు ధన్యవాదాలు.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి క్షేమంగా వుండండి` అని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
— Nivetha Thomas (@i_nivethathomas) April 3, 2021