Homeటాప్ స్టోరీస్వ‌కీల్‌సాబ్‌`.. మెలోడీ సాంగ్.. అప్పుడే రికార్డ్‌..

వ‌కీల్‌సాబ్‌`.. మెలోడీ సాంగ్.. అప్పుడే రికార్డ్‌..

Vakeel saab kanti papa lyrical video gores viral
Vakeel saab kanti papa lyrical video gores viral

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నీ మూవీ ఏప్రిల్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీపై బారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన మ‌గువ‌… ఓ మ‌గువ‌.., స‌త్య‌మేవ జ‌య‌తే.. గీతాలతో పాటు టీజ‌ర్‌కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మ‌రో మెలోడీ గీతానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. `కంటి పాప‌.. అంటూ సాగే ఈ గీతాన్ని హిట్ పెయిర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, శృతిహాస‌న్‌ల‌పై చిత్రీక‌రించారు.

- Advertisement -

రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా త‌మ‌న్ సంగీతం అందించారు. అర్మాన్ మాలిక్‌, దీపు, త‌మ‌న్‌, గీతా మాధురి ఆల‌పించారు. ఈ పాట రిలీజైన గంట‌ల్లోనే 2 మిలియ‌న్ వ్యూస్‌ని క్రాస్ చేసి రికార్డు వ్యూస్ దిశ‌గా ప‌య‌నిస్తోంది. అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం కోర్టు రూమ్ డ్రామాగా తెర‌కెక్కింది. ఈ మూవీ కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All