Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్‌క‌ల్యాణ్ - క్రిష్ ల పాన్ ఇండియా మూవీ టైటిల్ ఇదే!‌

ప‌వ‌న్‌క‌ల్యాణ్ – క్రిష్ ల పాన్ ఇండియా మూవీ టైటిల్ ఇదే!‌

Pawan - krish pan india movie title as Hari hara veeramallu
Pawan – krish pan india movie title as Hari hara veeramallu

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అభిమానుల‌కు మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ క్రిష్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ – క్రిష్‌ల క‌ల‌యిక‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇది ప‌వ‌న్ న‌టిస్తున్న 27వ చిత్రం. ఇటీవ‌లే `వ‌కీల్ సాబ్‌` చిత్రాన్ని పూర్తి చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ చిత్రాన్ని చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఏ.ఎం.ర‌త్నం స‌మ‌ర్ప‌ణ‌లో ఏ.ద‌యాక‌ర్‌రావు ఈ ఎపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ నుంచి అప్‌డేట్ కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో పాటు స‌గ‌టు సినీ అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ క్రిష్ సాలీడ్ అప్‌డేట్‌ని అందించారు. ప‌వ‌న్ న‌టిస్తున్న చారిత్రాత్మ‌క తొలి జాన‌ప‌ద చిత్రం కావ‌డంతో ఈ మూవీలో ప‌వ‌న్ ఎలా వుంటాడు. ఆయ‌న గెట‌ప్ ఎలా వుంటుంది? .. ఇంత‌కీ టైటిల్ ఏంటీ అంటూ గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ చిత్రానికి `హ‌రి హ‌రి వీర‌మ‌ల్లు` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు. ఫ‌స్ట్ లుక్‌తో పాటు గురువారం ఫ‌స్ట్ గ్లింప్స్‌ని విడుద‌ల చేశారు.

- Advertisement -

అ టైటిల్ కి `ది లెజండ‌రీ హీరోయిక్ ఔట్ లా` అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఫ‌స్ట్ గ్లింప్స్‌లో ప‌వ‌న్ మునుపెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త మేకోవ‌ర్‌తో ఫెరోషియ‌స్‌గా క‌నిపిస్తున్నారు. స్పెల్ బౌండ్ విజువ‌ల్స్‌తో 17వ శ‌తాబ్దం కాలంలోని మొఘ‌ల్‌, కుతుబ్ షాహీల ఎరా నేప‌థ్యంలో  ఈ మూవీ సాగ‌నుంది. ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. జూలై నాటికి చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. 150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీని  తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All