Homeటాప్ స్టోరీస్`వ‌కీల్ సాబ్‌` సెన్సార్ పూర్త‌యింది!

`వ‌కీల్ సాబ్‌` సెన్సార్ పూర్త‌యింది!

`వ‌కీల్ సాబ్‌` సెన్సార్ పూర్త‌యింది!
`వ‌కీల్ సాబ్‌` సెన్సార్ పూర్త‌యింది!

యావ‌త్ టాలీవుడ్ తో పాటు ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ప‌వ‌ర్‌స్టార్ మూడేళ్ల విరామం త‌రువాత చేసిన సినిమా కావ‌డంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఫ్యాన్స్ ప‌వ‌న్ సినిమా ఏ స్థాయిలో వుండ‌బోతోందా అని ఎదురుచూస్తుంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం ఏ రేంజ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ సంద‌డి చేయ‌నుందా అని ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

దిల్ 25 ఏళ్ల క‌ల‌ని నిజం చేసిన ప్రాజెక్ట్‌గా హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా అతిథి పాత్ర‌లో శృతిహాస‌న్ న‌టించింది. ఇక క‌థ‌కు కీల‌క‌మైన పాత్ర‌ల్లో నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల‌, ప్ర‌కాష్‌రాజ్ న‌టించారు. ఈ నెల 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ ఆక‌నున్న ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. U/A స‌ర్టిఫికెట్ ల‌భించింది.

- Advertisement -

ర‌న్ టైమ్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. 2:34 నిమిషాలు అని తెలిసింది. కోర్ట్ రూమ్ డ్రామాగా మ‌హిళా సాధికార‌త నేప‌థ్యంలో ఆద్యంతం ప‌వ‌ర్‌ఫుల్ స‌న్నివేశాల‌తో ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఇమేజ్‌కి త‌గ‌న‌ట్టుగా మ‌లిచారు. థియేట‌ర్ల‌లో ఈ మూవీ ఓ రేంజ్‌లో ర‌చ్చ చేయ‌డం గ్యారెంటీ అని తెలుస్తోంది. ట్రైల‌ర్ రిలీజ్ కే భారీ హంగామా చేసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ రిలీజ్ రోజు ఏ స్థాయిలో హ‌ల్‌చ‌ల్ చేస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All