Homeటాప్ స్టోరీస్`వి` మూవీ రివ్యూ

`వి` మూవీ రివ్యూ

`వి` మూవీ రివ్యూ
`వి` మూవీ రివ్యూ

న‌టీన‌టులు :  నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితీరావు హైద‌రీ, వెన్నెల కిషోర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం: ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌
నిర్మాత‌లు :  దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్ష‌త్‌రెడ్డి
సంగీతం:  అమిత్ త్రివేది
నేప‌థ్య సంగీతం : త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ :  పీజీ విందా
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంక‌టేష్
ఓటీటీ రిలీజ్ : అమెజాన్ ప్రైమ్‌
రిలీజ్ డేట్ : 05- 09 – 2020

క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త ఆరు నెల‌లుగా విడుద‌ల విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డిన చిత్రం `వి`. వైర‌స్ అంత కంత‌కు వ్యాప్తించ‌డం, కేంద్రం ఆన్ లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా థియేట‌ర్ల‌ల‌ని రీఓపెన్ చేసేందుకు అంగీక‌రించ‌క‌ప‌వ‌డంతో `వి` చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో లో రిలీజ్ చేయ‌క త‌ప్ప‌లేదు. నేచుర‌ల్ స్టార్  నాని 25వ చిత్రం కావ‌డం, తొలి సారి నాని సైకో కిల్ల‌ర్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించ‌డం, అత‌న్ని వెంటాడే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టించ‌డం, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తొలి సారి త‌న పంథాకు పూర్తి భిన్నంగా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశాన్ని ఎంచుకోవ‌డం వంటి కార‌ణాల‌తో ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా అంచ‌నాలు నెల‌కొన్నాయి. నాని ట్రైల‌ర్‌లో చెప్పిన‌ట్టే `వి` ఎక్స్‌పెక్టేష‌న్స్‌కి రీచ్ అయ్యేలా వుందా? .. ఇంద్ర‌గంటి త‌నదైన స్టైల్లో మ్యాజిక్ చేశారా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే. ‌

క‌థ‌:

- Advertisement -

డీసీపీ ఆదిత్య (సుధీర్‌బాబు) ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌. అతి క్లిష్ట‌మైన కేసుల్ని ఛాలెంజ్‌గా తీసుకుని అన‌తి కాలంలోనే మంచి పేరుని సొంతం చేసుకుంటారు. అంతే కాకుండా అత్య‌ధిక కేసుల్ని ప‌రిష్క‌రించిన పోలీస్ ఆఫీస‌ర్‌గా పోలీస్ గ్యాలెంట్రీ మెడ‌ల్‌ని అందుకుంటాడు. త‌న డిపార్ట్‌మెంట్ వారికి పార్టీ ఇస్తుండ‌గా అభిమానిని అంటూ అపూర్వ (నివేదా థామ‌స్‌` ఆదిత్య‌కు ప‌రిచ‌యం అవుతుంది. అది ప్రేఊమ‌గా మారుతుంది. అదే రోజు రాత్రి ఇన్‌స్పెక్ట‌ర్ వీర ప్ర‌సాద్ దారుణ హ‌త్య‌కు గుర‌వుతాడు. అత‌న్ని హ‌త్య చేసిన విష్ణు ( నాని) డీసీపీ ఆదిత్య‌కు ఓ క్లూని వ‌దిలి వెళ‌తాడు. మ‌రో నాలుగు హ‌త్య‌లు చేస్తానంటూ ఆదిత్య‌ని ఛాలెంజ్ చేస్తాడు. చెప్పిన‌ట్టే ఒక్కొక్కిరీనీ దారుణంగా హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపుతుంది. ఇంకీ విష్ణు ఎవ‌రు? ఎందుకు హ‌త్య‌లు చేస్తున్నాడు? ..అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి డీసీపీ ఆదిత్య ఏం చేశాడు? ..సాహెబా ( అదితీరావు హైద‌రీ)కి విష్ణుకు వున్న సంబంధం ఏంటి? ..వ‌రుస హ‌త్య‌ల‌కు సాహెబాకు సంబంధం వుందా? వ‌ఉంటే ఆ క‌థేంటి? అన్న‌ది ఇందులో ఆసక్తిక‌రం.

న‌టీన‌టుల న‌ట‌న‌:

నాని న‌టించిన 25వ చిత్ర‌మిది. కెరీర్‌లో ప్ర‌త్యేకంగా చెప్పుకునే ఈ చిత్రం అంతే ప్ర‌త్యేకంగా వుండాల‌ని ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఈ చిత్రంలో నెగెటివ్ ఛాయ‌లున్న పాత్ర‌లో కొత్త త‌ర‌హాలో క‌నిపించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న న‌ట‌న‌తో, హావ భావాల‌తో మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. సంభాష‌ణ‌లు ప‌లికే విధానంలోనూ గ‌త చిత్రాల‌కు భిన్నంగా వుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇక ప‌వ‌ర్‌ఫుల్ డీసీపీ పాత్ర‌లో సుధీర్‌బాబు ఒదిగిపోయార‌ని చెప్పొచ్చు. త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశారు. ప్ర‌థ‌‌మార్థంలో నాని – సుధీర్‌బాఉ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు రోమాంచితంగా వున్నాయి. ఇక  నివేదా థామ‌స్‌, అదితీరావు హైద‌రీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్ త‌మ పాత్ర‌ల ప‌రిథిమేర‌కు న‌టించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు:

అమిత్ త్రివేది సంగీతం బాగుంది. పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి త‌మ‌న్ నేప‌థ్య సంగీతం అందించారు. అదే ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. నాని, సుదీర్‌బాబు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, నాని మ‌ర్డ‌ర్స్ చేసిన స‌న్నివేశాల్లో ఆ మూడ్‌కి క‌నెక్ట్ అయ్యేలా త‌మ‌న్ నేప‌థ్య సంగీతం వుంది. త‌న సంగీతంతో ఈ స‌న్నివేశాల‌ని మ‌రింత ఎలివేట్ చేశారు. పీజీ విందా ఫొటోగ్ర‌ఫీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఇంద్ర‌గంటి సినిమా అంటే ఫొటోగ్ర‌ఫీ పీజీ విందానే అనేంత‌గా వారి మ‌ధ్య మంచి అనుబంధం వుంది. అందుకే త‌న ప్ర‌తి సినిమాకు విందానే కంటిన్యూ చేస్తున్నారు. ఈ సినిమాకి విందా అందించిన ఫొటోగ్ర‌ఫీ కూడా ప్ల‌స్‌గా మారింది. మార్తాండ్ కె. వెంక‌టేష్ ఎడిటింగ్ ఓకే కానీ సెకండ్ హాఫ్‌లో కొన్ని స‌న్నివేశాల్ని ట్రిమ్ చేయాల్సింది. ఇంద్ర‌గంటి ప‌నితీరు బాగున్నా ఎంచుకున్న పాయింట్ పాత‌ది కావ‌డంతో రొటీన్ స్టోరీగానే అనిపిస్తుంది.

విశ్లేష‌ణ‌:

రివేంజ్ డ్రామా నేప‌థ్యంలో వ‌చ్చిన చిత్ర‌మిది. ఈ త‌ర‌హా క‌థ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో చాలానే వ‌చ్చాయి. ప్ర‌థ‌మార్థాన్ని థ్రిల్లింగ్‌గా న‌డిపించారు. నాని, సుధీర్‌బాబు మ‌ధ్య ఛేజింగ్ స‌న్నివేశాల‌తో ఓ రేంజ్‌లో ఆస‌క్తిని రేకెత్తించారు. కానీ సెకండ్ హాప్ కి వ‌చ్చే స‌రికి ఆ టెంపోని మెయింటైన్ చేయ‌లేక‌పోయారు. పైగా ద్వితీయార్థాన్ని అంత బ‌లంగా రాసుకోలేక‌పోయారు. పైగా ద్వితీయార్థం క‌థాగ‌మ‌నం మందిగిస్తుంది. ప్ర‌థ‌మార్థంకు మించి ద్వితీయార్థాన్ని కూడా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసి వుంటే ట్రైల‌ర్‌లో నాని చెప్పినట్టుగా ఎక్స్‌పెక్టేష‌న్స్‌కి రీచ్ అయ్యేది బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యుండేది. ఆ విష‌యంలో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌, స్క్రిప్ట్‌ల‌పై ప‌ట్టున్న దిల్ రాజు మ‌రింత శ్రద్ద పెట్టివుంటే ఫ‌లితం మ‌రోలా వుండేది.

రేటింగ్ : 2.5/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All