Homeటాప్ స్టోరీస్నాని `వి` మూవీ ఆ ప‌ని కూడా కంప్లీట్‌‌!

నాని `వి` మూవీ ఆ ప‌ని కూడా కంప్లీట్‌‌!

నాని `వి` మూవీ ఆ ప‌ని కూడా కంప్లీట్‌‌!
నాని `వి` మూవీ ఆ ప‌ని కూడా కంప్లీట్‌‌!

నాని, సుధీర్‌బాబు తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `వి`. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఇండ‌ద్ర‌గంటి మోహ‌న కృష్ణ ర‌పొందించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నివేదా థామ‌స్‌, అదితీరావు హైద‌రీ న‌టించారు. వ‌రుస చ‌ర్చ‌ల అనంత‌రం ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు. సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ మెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

డిజిట‌ల్ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం దాదాపు 200 దేశాల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. నాని తొలి సారి విల‌న్ ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టించ‌డం, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్ర స్టోరీ లైన్ ఇటీవ‌లే లీక్ అవ్వ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో ఈ మూవీ వుండ‌బోతోంది. ప్ర‌తీకారం కోసం త‌పించే వ్య‌క్తిగా హీరో నాని క‌నిపించ‌నుండ‌గా, అత‌న్ని వెంటాడే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా సుధీర్‌బాబు క‌నిపించ‌బోతున్నారు.

- Advertisement -

‌తాజాగా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకుందని తెలిసింది. సెన్సార్ స‌భ్యులు ఈ చిత్రానికి యు/ఏ స‌ర్టిఫికెట్‌ని ఇచ్చిన‌ట్టు స‌మాచారం. జ‌గ‌ప‌తిబాబు, నాజ‌ర్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో అదితీరావు, నివేదా థామ‌స్‌ల పాత్ర‌ల‌కు కూడా ప్రాధాన్యం వుంటుంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All