
కరోనా మహమ్మారి కారణంగా క్రేజీ స్టార్స్ నటించిన చిత్రాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ అవుతాయో తెలియక ఈ చిత్రాల నిర్మాతలు తలపట్టుకుంటున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్రాల్లో నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు తొలిసారి కలిసి నటించిన చిత్రం `వి` ఒకటి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా థామస్, అదితిరావు హైదరీ హీరోయిన్‌లుగా నటించారు.
ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్, టు సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలని పెంచేసింది. సినిమా కూడా ఓ రేంజ్‌లో వుండేలా కనిపిస్తోందని ప్రేక్షకులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చాలా ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. నాని తొలి సారి నెగెటివ్ టచ్ వున్న పాత్రలో నటించి ఈ యాక్షన్ థ్రిల్లర్ గత కొంత కాలంగా కరోనా వల్ల విడుదలకు నోచుకోవడం లేదు. కరోనా ఉదృతి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే మేకర్స్ మాత్రం ఎప్పుటి కప్పుడు ఈ వార్తల్ని ఖండిస్తూ `వి` థియేటర్‌లోనే రిలీజ్ అవుతుందని చెబుతూ వస్తున్నారు.
కానీ తాజాగా పరిస్థితి మారినట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌తో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, భారీ డీల్ కూడా కుదిరినట్టు తెలుస్తోంది. ఇందు కోసం మేకర్స్ ట్రైలర్‌ని సిద్ధం చేస్తున్నారని తెలిసింది. వచ్చే వారం ట్రైలర్‌ని రిలీజ్ చేస్తారట. ఈ ట్రైలర్ ఓటీటీ లో రిలీజ్ కోసమేనని వార్తలు వినిపిస్తున్నాయి. అంతా ఓకే అయిపోతే ఈ చిత్రాన్ని ఓటీటీలో ముందు చెప్పినట్టుగా సెప్టెంబర్ 5న రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.