Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు ని కలిసిన ముఖ్యమంత్రి

మహేష్ బాబు ని కలిసిన ముఖ్యమంత్రి

Uttarakhand CM Trivendra Singh Rawat surprise meeting with mahesh babu భరత్ అనే నేను చిత్రంలో ముఖ్యమంత్రి గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు మహేష్ బాబు కాగా తాజాగా తన సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి ఓ ముఖ్యమంత్రి రావడం తో ఆ ముఖ్యమంత్రి కి సాదర స్వాగతం పలికాడు యాక్టింగ్ ముఖ్యమంత్రి మహేష్ బాబు . భరత్ అనే నేను చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న మహేష్ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా చేస్తున్నాడు .

ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైంది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈరోజు డెహ్రాడూన్ లో ప్రారంభమైంది . కాగా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రావడంతో ఆ చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసారు . మహేష్ బాబు కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే . మహేష్ తో కొంతసేపు మాట్లాడాకా ఆ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేసి వెళ్లిపోయారు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ . మహేష్ బాబు – త్రివేంద్ర సింగ్ రావత్ కలిసి ఉన్న ఫోటో షోషల్ మీడియాలో సర్కిల్ అవుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts