Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్ లో డీసెంట్ గా మొదలైన గ్యాంగ్ లీడర్ ప్రయాణం

ఓవర్సీస్ లో డీసెంట్ గా మొదలైన గ్యాంగ్ లీడర్ ప్రయాణం

Nani Gang Leader
ఓవర్సీస్ లో డీసెంట్ గా మొదలైన గ్యాంగ్ లీడర్ ప్రయాణం

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిటిక్స్ తమ రేటింగ్స్ కూడా ఇచ్చేసారు. ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్ళందరూ ఇదొక డీసెంట్ రివెంజ్ కామెడీ డ్రామా అని తీర్పునిచ్చేసారు. ప్రేక్షకుల స్పందన కూడా ఇంచుమించు అలానే ఉంది. ఇక ఓవర్సీస్ లో గ్యాంగ్ లీడర్ ప్రీమియర్ కలెక్షన్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం యూఎస్ లో గ్యాంగ్ లీడర్ 177 లొకేషన్లలో $182K డాలర్లు వసూలు చేసింది. ఇది నాని కెరీర్ లో రెండో అత్యధికం. ఎంసీఏ మొదటి స్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్యాంగ్ లీడర్ కల్లెక్షన్లు బానే ఉన్న నేపథ్యంలో చిత్రం హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రీ రిలీజ్ జరిగిన 30 కోట్లు గ్యాంగ్ లీడర్ వసూలు చేయగలదో లేదో మరి కొన్ని రోజులు ఆగితే కానీ తెలీదు.

- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని విక్రమ్ కుమార్ తెరకెక్కించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All