Homeగాసిప్స్గ్యాంగ్ లీడర్ : ఆన్లైన్ లో అప్పుడే..

గ్యాంగ్ లీడర్ : ఆన్లైన్ లో అప్పుడే..

Gang Leader
గ్యాంగ్ లీడర్ : ఆన్లైన్ లో అప్పుడే..

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఈరోజు భారీ ఎత్తున విడుదలైంది. ఈ చిత్రానికి బ్రహ్మాండమైన టాక్ అయితే రాలేదు కానీ బాగుందనే అంటున్నారు. ఇక చిత్ర ఫలితం గురించి అప్పుడే మాట్లాడుకోవడం సబబు కాదు. ఇదిలా ఉంచితే గ్యాంగ్ లీడర్ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ లో అగ్రగామిగా వెలుగొందుతున్న అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకుంది. నిజానికి మైత్రి మూవీస్ వారు తమ ప్రతి సినిమాని ప్రైమ్ కే విక్రయిస్తున్నారు.

డిజిటల్ స్ట్రీమింగ్ సైట్లు ఊపందుకున్నాక, డిజిటల్ రైట్స్ పేరిట నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అవుతోంది. అయితే సినిమా థియేటర్లలో ఉండగానే ముందుగా చేసుకున్న ఒప్పందం వల్ల స్ట్రీమింగ్ సైట్లలో విడుదల చేస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పట్లేదు. ఇది జరగకూడదనే ఉద్దేశంతో గ్యాంగ్ లీడర్ కు 50 రోజుల లిమిట్ పెట్టుకున్నారు. అంటే 50 రోజుల తర్వాతే ప్రైమ్ లో గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల కానుందన్నమాట.

- Advertisement -

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All