Homeటాప్ స్టోరీస్మొదటి సినిమాకే ఈ రేంజ్ బిజినెస్ ఏంటి?

మొదటి సినిమాకే ఈ రేంజ్ బిజినెస్ ఏంటి?

Uppena tremendous pre release business
Uppena tremendous pre release business

డెబ్యూ హీరో ఎంతటి స్టార్ వారసుడైనా ఓపెనింగ్స్ విషయంలో చాలా సందేహాలుంటాయి కాబట్టి బడ్జెట్ ఎక్కువ కాకుండా చూసుకుంటారు. పైగా మొదటి సినిమా సేఫ్ వెంచర్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. మినిమమ్ గ్యారంటీ హిట్ అనుకున్న కథను ఎంచుకుంటారు. మొదటి సినిమాతో సేఫ్ గా లాంచ్ అయిపోతే ఆ తర్వాతి సంగతి తర్వాత అన్న భావన అందరిలోనూ ఉంటుంది. అయితే కొంత మంది దానికి వ్యతిరేకంగా వెళ్లారు. భారీ బడ్జెట్ ను సెట్ చేసుకున్నాడు. కొంత మంది సక్సెస్ అయితే మరికొంత మంది ఫెయిల్యూర్ అయ్యారు.

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేయబోతున్న సంగతి తెల్సిందే. ఉప్పెన అనే టైటిల్ తో వస్తోన్న ఈ చిత్రం రొటీన్ కు భిన్నంగా ఉంటుందని తేలింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ చిత్రానికి సంబందించిన ఫీల్ కానీ అన్నీ వేరేగా ఉన్నాయి. అందులోనూ తొలి సినిమా అయినా దీనికోసం బాగానే ఖర్చు పెట్టారు. ఈ సినిమాను ఏకంగా 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ కథను నమ్మి దర్శకుడు కొత్తవాడైనా కానీ ధైర్యం చేసారు. పైగా ఈ దర్శకుడు తన గురువు సుకుమార్ సపోర్ట్ కూడా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ కు సుకుమార్ అంటే అమితమైన గౌరవం. అందుకే ఈ సినిమాకు భారీ ఖర్చు పెట్టారు.

- Advertisement -

అయితే నిర్మాతలు ఉప్పెన విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చిత్రానికి బిజినెస్ ఎంక్వయిరీలు బాగానే జరుగుతున్నాయి. థియేట్రికల్ బిజినెస్ ను దాదాపు 15 కోట్లకు అమ్మబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నాన్ థియేట్రికల్ హక్కులు కూడా కలుపుకుంటే నిర్మాతలు సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదంతా బానే ఉంది కానీ ఒక డెబ్యూ హీరో, అందులోనూ కొత్త దర్శకుడి సినిమా 15 కోట్లు దాటి వసూలు చేయగలదా అనేదే సందేహం. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All