Homeన్యూస్బేబమ్మా.. అప్పుడే లిప్ లాక్ ఏంటమ్మా..?

బేబమ్మా.. అప్పుడే లిప్ లాక్ ఏంటమ్మా..?

Uppena Bebamma Alias Krithi Shetty Liplock for Nani Shyam Singha Roy Movie

ఉప్పెన సినిమాతో మొదటి సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు కృతి శెట్టి. ఫస్ట్ సినిమానే మంచి కథ దొరకడం అందులో కృతి శెట్టి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆమె సూపర్ పాపులర్ అయ్యింది. ఉప్పెన హిట్ అవడమే ఆలస్యం అర డజను సినిమాలు ఆమె చేతికి వచ్చాయి. బేబమ్మ సినిమా ఆఫర్లు చూసి మిగతా హీరోయిన్స్ షాక్ అవుతున్నారు.

- Advertisement -

ఇదిలాఉంటే ఫస్ట్ సినిమా అయ్యిందో లేదో రెండో సినిమాకే కృతి కూడా లిప్ లాక్ కానిచ్చేసింది. హీరోయిన్ గా ఛాన్సులు రాక ఫేడవుట్ కి దగ్గర పడుతున్న టైం లో కొందరు ఇక దేనికైనా రెడీ అనేస్తారు. కాని చేతిలో సూపర్ ఛాన్సులు ఉంచుకుని కూడా కృతి శెట్టి నానితో లిప్ లాక్ చేసింది. ఉప్పెన బ్యూటీ లిప్ లాక్ టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.

నాని శ్యామ్ సింగ రాయ్ లో కృతి శెట్టి నటిస్తుంది. సినిమాలో నానితో జస్ట్ అలా లిప్ లాక్ చేసింది. అయితే కథ డిమాండ్ చేస్తే తప్ప కృతి శెట్టి ఇలా చేయదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా రెండో సినిమాకే కృతి శెట్టి లిప్ లాక్ ఆడియెన్స్ కు కూడా షాక్ ఇచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All